- Home
- Entertainment
- CM Vijay Thalapathy : జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్‌కి 'A' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా?
CM Vijay Thalapathy : జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్‌కి 'A' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా?
CM Vijay Thalapathy: విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమాకు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే, విజయ్ కెరీర్‌లో 'A' సర్టిఫికెట్ పొందిన మొదటి సినిమా ఇది కాదు. ఇంతకుముందే ఓ సినిమాకు 'A' ట్యాగ్ వచ్చింది. ఆ సినిమా ఏంటో తెలుసా?
14

Image Credit : instagram
ఖుషీలో విజయ్ దళపతి అభిమానులు..
తమిళనాడు సీఎం, నటుడు విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సెన్సార్ చిక్కులు వీడి, సినిమా త్వరలో రిలీజ్ కానుంది. CBFC వెబ్‌సైట్ ప్రకారం, ఈ సినిమా రన్‌టైమ్ 183 నిమిషాలు. ఈ వార్తతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : instagram
25 ఏళ్ల క్రితం విజయ్ సినిమాకు ఏ సర్టిఫికెట్..
సాధారణంగా విజయ్ సినిమాలకు 'U' లేదా 'U/A' సర్టిఫికెట్లు వస్తాయి. కానీ 'జన నాయగన్'కు 'A' రావడంతో ఇదే మొదటిసారి అనుకుంటున్నారు. నిజానికి 25 ఏళ్ల క్రితమే 'భగవతి' అనే విజయ్ సినిమాకు 'A' సర్టిఫికెట్ వచ్చింది. అప్పట్లో సెన్సార్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవని, యాక్షన్ సీన్‌లో కొద్దిగా రక్తం కనిపించినా 'A' ఇచ్చేవారని, అందుకే 'భగవతి'కి అలా ఇచ్చారని దర్శకుడు ఎ. వెంకటేశ్ ఓ సందర్భంలో చెప్పారు.
34
Image Credit : KVN Productions
జన నాయగన్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు..?
'జన నాయగన్' సినిమాను మొదట సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని సీన్లు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయనే కారణంతో CBFC సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో రిలీజ్ వాయిదా పడింది. తర్వాత మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి 'U/A 16+' ఇవ్వాలని ఆదేశించినా, CBFC అప్పీల్‌కు వెళ్లడంతో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం ముగిసింది. ఈ మధ్యలో సినిమాలోని కొన్ని సీన్లు ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం కూడా కలకలం రేపింది.
44
Image Credit : KVN Productions, SS Music
అభిమానుల ఎదురుచూపులు..
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నరేన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సెన్సార్ సమస్యలు తీరడంతో, కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో ప్రకటిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Latest Videos

