MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాట తప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో `గేమ్‌ ఛేంజర్‌` టికెట్ రేట్లు పెంపు, ఎంత పెరిగాయంటే?

మాట తప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో `గేమ్‌ ఛేంజర్‌` టికెట్ రేట్లు పెంపు, ఎంత పెరిగాయంటే?

తెలంగాణలో టికెట్‌ రేట్లు పెరిగాయి. అసెంబ్లీలో చెప్పిన మాటని తప్పాడు సీఎం రేవంత్‌ రెడ్డి. `గేమ్‌ ఛేంజర్‌` మూవీకి టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 08 2025, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాట తప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన తాను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్‌ షోలు ఉండవని, టికెట్ రేట్లు పెరగవని ప్రకటించారు. కానీ ప్రకటించి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే మాట తప్పాడు. అసెంబ్లీలో తాను ప్రకటించిన మాటనే ఆయన ఫాలో కాలేదు.

ఆయనే కాదు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా అసెంబ్లీలోనే బెనిఫిట్‌ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచము అన్నారు. తాజాగా తెలంగాణలో `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి టికెట్‌ రేట్లు పెంచుతూ బుధవారం జీవో జారీ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తెలంగాణ `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి టికెట్‌ రేట్లని పెంచారు. అదే సమయంలో ఆరు షోలకు పర్మీషన్‌ ఇచ్చారు. సాధారణంగా నాలుగు, ఐదు షోస్‌ ఉంటాయి. కానీ ఆరుషోలకు కూడా అనుమతి ఇచ్చారు. ఉదయం నాలుగు గంటల షోకి కూడా అనుమతినిచ్చింది. అదే సమయంలో టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది.

మల్టీప్లెక్సుల్లో రూ.150, సింగిల్‌ థియేటర్లలో వంద రూపాయలు పెంచుతూ జీవో విడుదల చేసింది. అయితే ఇది కేవలం ఒక్క రోజు మాత్రమే. రిలీజ్‌ డే రోజే ఈ రేట్లు ఉంటాయి. `గేమ్‌ ఛేంజర్‌` సినిమా జనవరి 10న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. 
 

35

ఇక జనవరి 11 నుంచి కూడా టికెట్‌ రేట్లు పెంచింది. మల్టీఫ్లెక్సుల్లో 100 రూపాయలు, సింగిల్‌ థియేటర్లలో యాభై రూపాయలు పెంచుతూ జీవోలో పేర్కొంది. జనవరి 19 వరకు ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి. పెరిగిన రేట్లతో మల్టీప్లెక్సుల్లో ఒక టికెట్‌ ధర రూ.400, సింగిల్‌ థియేటర్లలో రూ.250 ఉంటుంది.  

తెలంగాణ సీఎం అసెంబ్లీలో టికెట్‌ రేట్లు పెంచము అని ఇప్పుడు పెంచడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కామెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఇది కొత్త వివాదానికి దారితీయబోతుందని తెలుస్తుంది.

45

అయితే నిర్మాత దిల్‌ రాజు ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమారు రూ..450కోట్ల బడ్జెట్‌ పెట్టి `గేమ్‌ ఛేంజర్‌` సినిమాని నిర్మించారు. బిజినెస్‌ కూడా భారీగానే అయ్యింది.

ఇలాంటి టైమ్‌లో టికెట్‌ రేట్లు పెంచకపోతే రికవరీ కష్టమని, నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు దిల్‌ రాజు. ఆయన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దిల్‌రాజు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

read more: `గేమ్‌ ఛేంజర్‌`కి లైన్‌ క్లీయర్‌.. `పుష్ప 2` టీమ్‌ వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న దిల్‌ రాజు
 

55

ఇక `గేమ్‌ ఛేంజర్‌` మూవీకి ఏపీ ప్రభుత్వం కూడా టికెట్‌ రేట్లు పెంచింది. అలాగే మార్నింగ్‌ 1గంట షోకి కూడా పర్మీషన్‌ ఇచ్చింది. 1గంట షోకి ఆరువందలు పెంచింది. అదే సమయంలో ఆరు షోలకు అనుమతి ఇచ్చింది.

ఆ తర్వాత మల్టీఫ్లెక్సుల్లో రూ.175, సింగిల్‌ థియేటర్లలో రూ.135రూపాయలు పెంచుతూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 11 నుంచి 23 వరకు ఈ రేట్లు అమలులో ఉంటాయి. ఇలా మల్టీప్లెక్సుల్లో రూ.352, సింగిల్‌ థియేటర్లలో రూ.282 టికెట్‌ రేట్లు ఉండబోతున్నాయి. `పుష్ప2`తో పోల్చితే ఇవి చాలా తక్కువ అనే చెప్పాలి. 

also read: 'గేమ్ ఛేంజర్' కాపీనా? స్టార్ హీరో సినిమా కథే, రిలీజ్ కి ముందు మరో వివాదం

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroines: నయనతారకి షాక్‌, శ్రీలీల రచ్చ.. సమంత, రష్మిక, కాజల్‌ స్థానాలివే.. ఇండియా టాప్ 10 హీరోయిన్లు
Recommended image2
Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Jana Nayagan: `జన నాయగన్` విజయ్ చివరి సినిమా కాదు, మొదటి సినిమా.. స్టోరీ లీక్‌ చేసిన డైరెక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved