జూనియర్‌ ఆర్టిస్ట్‌లకు సినిమా కష్టాలు.. లాక్‌ డౌన్‌తో చీకటైన జీవితాలు

First Published 4, Jun 2020, 12:27 PM

కరోనా వైరస్‌ కారణంగా అన్ని రంగాలు కుదేళవుతున్నాయి. ముఖ్యంగా వినోద రంగం మీద ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. సినిమాలకు సీరియల్లకు సంబంధించిన షూటింగ్ లు ఇతర కార్యక్రమాలు ఆగిపోవటంతో ఆ రంగంలో పనిచేసే కార్మికులు, రోజు వారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా రోజు కూలీతో బతికే జూనియర్‌ ఆర్టిస్ట్‌ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం వారికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది. సినీ పెద్దలు చేస్తున్న సాయం కూడా వారికి పూర్తి స్థాయిలో సరిపోవటం లేదు. హైదరాబాద్‌లోని కృష్టానగర్, ఇందిరా నగర్‌లలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పెద్ద సంఖ్యలో నివసిస్తారు.

దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్న నటీనటులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. షూటింగ్‌ లు నడిచిన కాలంలో కూడా బతుకు బండి అంతంత మాత్రంగానే నడిపించిన వారు, లాక్‌ డౌన్‌తో ఇండస్ట్రీ స్థంబించటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ప్రస్తుతం షూటింగ్‌లు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తున్నా జూనియర్ ఆర్టిస్ట్‌లను ఎంత వరకు తీసుకుంటారన్నది కూడా ప్రశ్నార్థకమే. ఒక వేళ తీసుకున్నా పెద్ద వయసు వారిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరు.

కానీ ఇండస్ట్రీలో 60 ఏళ్లు పైబడిన జూనియర్‌ ఆర్టిస్ట్‌లే ఎక్కువ మంది ఉన్నారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియని పరిస్థితి, ఈ నేపథ్యంలో వారు జీవనం ఎలా సాగించాలో పాలుపోక ఆవేదన చెందుతున్నారు.

వీరిలో కొంత మంది కథలు మరింత హృదయవిధారకంగా ఉన్నాయి. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు కూడా రోజు వారి కూలీ మీదే ఆదారపడే పరిస్థితి. అలాంటి వారికి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ (కరోనా క్రైసిస్‌ చారిటీ) ద్వారా అందిస్తున్న సరుకుల మీదే ఆదారపడుతున్నారు. దశాబ్దాల క్రితం సినిమా పిచ్చితో కుటుంబాలను వదిలి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారంతా ఆసరా లేక, ఉపాది లేక ఇబ్బందుల్లో ఉన్నారు.

loader