Vijay Deverakonda: బయటపడ్డ నిజం.. విజయ్ దేవరకొండ కోసం కూతురి జీవితాన్ని నాశనం చేసిన తండ్రి
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. వివాదాలు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది అని అంతా భావించారు.

Vijay Deverakonda
విజయ్ దేవరకొండ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. వివాదాలు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది అని అంతా భావించారు. మధ్యలో కొన్ని దారుణమైన ఫ్లాపులు పడ్డాయి. వాటిలో లైగర్ చిత్రం ఒకటి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీ భారీ అంచనాలతో విడుదలై దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అనన్యకి ఇదే తొలి తెలుగు చిత్రం. లైగర్ కనుక హిట్ అయి ఉంటే అనన్య కెరీర్ మరోలా ఉండేది. ఇస్మార్ట్ శంకర్ లాంటి క్రేజీ హిట్ తర్వాత పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం.. పైగా యువతలో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ హీరో.. దీనితో అనన్య పాండే ఈ చిత్రానికి ఒకే చెప్పింది. అయితే ఆమె అంగీకారం వెనుక అనన్య తండ్రి చుంకీ పాండే బలవంతం కూడా ఉందట.
ఈ చిత్ర కథ వినగానే అనన్యకి ఏదో తేడాగా అనిపించిందట. ఈ కథ తనకి సెట్ కాదని, చిన్నపిల్లలా అనిపిస్తానని తండ్రికి అనన్య చెప్పింది. ఈ విషయాలని చుంకీ పాండే ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అనన్యకి లైగర్ చిత్రంలో నటించడం ఇష్టం లేదు. ఆ విషయం నాకు చెప్పింది.
కానీ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో తానే బలవంతం చేసి అనన్యని ఒప్పించానని చుంకీ పాండే తెలిపారు. ఈ చిత్రం హిట్ అయితే మంచి పేరు వస్తుందని నా కూతుర్ని బలవంతంగా ఒప్పించా. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫలితం చూసి నా కూతురు చెప్పిందే కరెక్ట్ అని అనిపించింది. అప్పటి నుంచి అనన్య పాండే సినిమాల విషయంలో తాను జోక్యం చేసుకోవడం లేదని, సలహాలు ఇవ్వడం మానేశానని చుంకీ పాండే అన్నారు.
లైగర్ ఫ్లాప్ తర్వాత అనన్యకి టాలీవుడ్ లో మరో ఛాన్స్ రాలేదు. ఆ టైంలో జాన్వీ కపూర్, అనన్యకి సమానంగా క్రేజ్ ఉండేది. కానీ జాన్వీ కపూర్ తొందరపడకుండా ఎన్టీఆర్ చిత్రం ఎంచుకుని సక్సెస్ అయింది. ఇప్పుడు ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ విధంగా కూతురి కెరీర్ నాశనం కావడానికి చుంకీ పాండే కారణం అయ్యారు.

