MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన జానీ మాస్టర్!

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన జానీ మాస్టర్!

లైంగిక వేధింపుల కేసులో బుక్ అయిన జానీ మాస్టర్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 19 2024, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు లేడీ కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Jani Master

Jani Master


చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. 

జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) కేసు సైతం నమోదైంది. అరెస్ట్ చేస్తారని తెలిసి, గత మూడు రోజులుగా జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. మొదట అతడు నెల్లూరులో ఉన్నాడని సమాచారం అందింది. అనంతరం లడఖ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి.
 
 

35
Jani Master controversy

Jani Master controversy

ఎట్టకేలకు జానీ మాస్టర్ దొరికాడని సమాచారం. గోవాలో  సైబరాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరచనున్నారు. అనంతరం పీటీ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలిస్తారని తెలుస్తుంది. 

కాగా జనసేన పార్టీ సభ్యుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 
 

45
Jani Master

Jani Master

మరోవైపు అనసూయ, సమంత సదరు యువతికి తమ మద్దతు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ మాదిరి.. తెలంగాణ గవర్నమెంట్ సైతం కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేయాలని సమంత కోరారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?


 

55
Jani Master

Jani Master

అలాగే నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై నేరుగా ఆరోపణలు చేసింది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేస్తే స్పందించలేదని ఆమె ఎక్స్ లో రాసుకొచ్చారు. పూనమ్ కౌర్ ఆరోపణలపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఇప్పుడు ఫిర్యాదు చేసినా విచారణ చేపడతామని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. జానీ మాస్టర్ తో మొదలైన లైంగిక వేధింపుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image3
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved