MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరు, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్.. మన టాలీవుడ్ హీరోలు ఇష్టంగా తినే వంటలేంటంటే...?

చిరు, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్.. మన టాలీవుడ్ హీరోలు ఇష్టంగా తినే వంటలేంటంటే...?

తమ అభిమాన స్టార్ అంటే ప్రాణంగా చూసుకుంటారు ఫ్యాన్స్.  ఆ స్టార్ ఫ్యాషన్ తో పాటు వారి అలవాట్లను కూడా అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక తమ స్టార్ల ఇష్టాలనే తమ ఇష్టాలుగామార్చుకుంటారు. అలా ఫుడ్ విషయంలో కూడా హీరోలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకీ మనటాలీవుడ్ స్టార్ హీరోలు ఏవి ఇష్టం గా తింటారో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2022, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మన తెలుగు హీరోలలో మంచి ఫుడీ ఎవరు..? ఇష్టంగా ఏం తింటారు..? ప్రభాస్ కు ఏమి ఇష్టం, మెగాస్టార్ ఏ ఐటం ఎక్కువగా తింటారు..? ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎక్కువగా ఏం తింటారు..? చరణ్ ఎక్కడికి వెళ్లినా పక్కాగా ఉండాల్సిన ఫుడ్ ఐటం ఏంటీ..? 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి  మొదటి నుంచి మంచి ఫుడీ. ఆయనకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అది కూడా అమ్మ చేసిన చేపల వేపుడు అంటే ప్రాణం. అమ్మ చేసిన చేపల పులుసుకి ఏది సాటి రాదంటారాయన. దానితో పాటు కొన్నిరకాల బిర్యానీలు కూడా బాగా ఇష్టంగా తింటారు చిరంజీవి. ముఖ్యంగా రొయ్యలంటే అసలే వదిలిపెట్టరు. 

39

ఇక బాలయ్య బాబుకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తండ్రి ఎన్టీఆర్  నట వారసత్వాన్నే కాదు... ఆయనలా బాలయ్య కూడా మంచి భోజన ప్రియుడు కూడా.  రొయ్యల బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తింటారు బాలయ్య. నాటు కోడి పులుసు కూడా బాగా ఇష్టపడతారట నటసింహం. 
 

49

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఫుడ్ ను బాగా ఆస్వాదిస్తారు. డైట్ లు అంటూ కడుపు మాడ్చుకోకుండా.. ఇష్టమైన ఫుడ్ ను మితంగా తింటారు పవన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నాటు కోడి పులుసు అంటే చాలా ఇష్టం. అది కాకుండా వెజ్ లో పులిహోరను చాలా ఇష్టంగా తింటారు పవన్. 

59

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. చూడటానికి చాలా నాజూగ్గా ఉంటాడు కాని ఆయన కూడా మంచి ఫుడీనే. ఏం అందంరా బాబు.. అసలు ఏం తింటాడు మహేష్ అని అమ్మాయిలంతా అనుకుంటారు కదా. సూపర్ స్టార్ కు ఇష్టమైన ఫుడ్ మెనూలో  ఫిష్ సూప్ తో పాటు.. ప్రత్యేకంగా తయారు చేసిన హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంది. ఇదే ఆయన హెల్త్ సీక్రేట్. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా.. మితంగా తింటారు మహేష్. ఫుడ్ ను బాగా ఆస్వాదిస్తారు. ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి బోజనం చేయడం అంటే ఇష్టపడతారు మహేష్. 

69

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత భోజన ప్రియుడో చాలా సార్లు ఆయనే చెప్పారు. బన్నీకి చాలా ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. అన్ని రకాల హైదరాబాడ్ బిర్యానీలను అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తారు.  
 

79

ఇక యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్  ఇంత అందంగా.. ఎత్తుగా ఆజానుభాహుడిలా ఉంటాడు.. ఏంతింటాడబ్బా అని అందరూ అనుకుంటుంటారు. ప్రభాస్ రాజు కు.. రాజు గారి పులావ్ అంటే చాలా ఇష్టమట. పులావ్ లో కోడిపులావ్ ఒక్కటనే కాదు.. పులావ్ లో ఎన్ని వెరైటీలు ఉన్నా.. అన్నింటిని ఆస్వాదిస్తారట ప్రభాస్. 

89

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తినడం అంటే చాలా ఇష్టమట.. అంతే కాదు తినడంతో పాటు వండటాన్ని కూడా ఆయన  చాలా బాగా ఆస్వాదిస్తారట. ఇష్టమైన ఫుడ్ వండుకుని తింటే ఆ మజానే వేరు అంటారు ఎన్టీఆర్. ఆయన బాగా నాటు కోడి కీమాతో పాటు నాటుకోడి పులుసు.. హలీమ్ లను ఎంజాయ్ చేస్తారట. హలీమ్ అంటే తారక్ కు చాలా ఇష్టం. సీజన్ లో రోజుకు ఒక్క సారి అయినా టేస్ట్ చేస్తారట. 

99

ఇక మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంత ఫిట్ గా కనిపిస్తారు కదా.. ఏ నాన్ వేజ్ నో ఇష్టపడతారు అని అనుకుంటే పొరపాటే. రామ్ చరణ్ కు పప్పు, ఆవకాయ, అప్పడం, నెయ్యి,  ఉంటే చాలు ఆరోజు పండగేనట. అంతే కాదు ఐస్ క్రీమ్ లు కూడా చాలా ఇష్టంగా తింటారట చరణ్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Recommended image2
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image3
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved