- Home
- Entertainment
- `విశ్వంభర` మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన చిరంజీవి.. డిలేకి కారణమిదే.. ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే వార్త
`విశ్వంభర` మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన చిరంజీవి.. డిలేకి కారణమిదే.. ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే వార్త
`విశ్వంభర` సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందనే ఆతృతగా ఉన్న ఫ్యాన్స్ కి నిరాశ పరిచే వార్త చెప్పారు చిరంజీవి. ఈ ఏడాది ఉండబోదని, వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్టు లీక్ చేశారు.

సోషియో ఫాంటసీగా `విశ్వంభర` మూవీ
మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా రాక రెండేళ్లు అవుతుంది. చివరగా ఆయన `భోళా శంకర్` తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ బాగా డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతుంది. `జగదేక వీరుడు అతిలోక సుందరి` తర్వాత చిరు నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు.
KNOW
అనేకసార్లు వాయిదా పడ్డ `విశ్వంభర`
వీఎఫ్‌ఎక్స్ కారణంగా మూవీ డిలే అవుతున్నట్టు తెలుస్తోంది.ఆ మధ్య విడుదలైన టీజర్‌లో వీఎఫ్‌ఎక్స్ బాగా లేవనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఉన్న స్టాండర్డ్స్ లో లేవని ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియెన్స్ కూడా పెదవి విరిచారు. ఈ క్రమంలో వీఎఫ్‌ఎక్స్ విషయంలో చాలా టైమ్ తీసుకున్నారు. క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదు. గతంలో ఓ కంపెనీకి ఇవ్వగా చిరంజీవితోపాటు టీమ్ సాటిస్పై కాలేదు. దీంతో మరో కంపెనీకి మార్చినట్టు సమాచారం. అందుకే డిలే అవుతుంది. ఈ వీఎఫ్‌ఎక్స్ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాలని టీమ్ భావించింది.
`విశ్వంభర` రిలీజ్ వాయిదాకి కారణం చెప్పిన చిరు
చిరంజీవి బర్త్ డేని పురస్కరించుకుని సర్‌ప్రైజ్ ఇచ్చింది టీమ్. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. చిరంజీవితో ఈ మేరకు గురువారం ఉదయం ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో మెగాస్టార్ తన `విశ్వంభర` మూవీ ఎందుకు డిలే అవుతుందో తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఆలస్యమవుతుందని చెప్పారు.
చందమామ కథలా `విశ్వంభర`
అదే సమయంలో ఇదొక చందమామ కథలా ఉంటుందని, చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు. అంతేకాదు పెద్దవాళ్లు కూడా దీన్ని ఆస్వాధిస్తారని, అంత బాగా ఉంటుందని చెప్పారు. సెకండాఫ్ ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ పై ఆధారపడి ఉంటుందని, అందుకే క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదన్నారు.
`విశ్వంభర` రిలీజ్ డేట్ లీక్
ఈ సందర్భంగా `విశ్వంభర` రిలీజ్ డేట్‌ని లీక్ చేశారు చిరు. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. సమ్మర్‌కిది పర్‌ఫెక్ట్ మూవీ అని, చిన్న పిల్లల నుంచి, పెద్ద వాళ్లకు సినిమా ఎంజాయ్ చేయాలంటే సమ్మర్ కరెక్ట్ టైమ్ అన్నారు. అదే సమయంలో ఈ రోజు సాయంత్రం తన బర్త్ డే గిఫ్ట్ గా గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఈ మూవీ రిలీజ్ ఈ ఏడాది ఉండబోదని చెప్పి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశారు చిరంజీవి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️
Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡
-- https://t.co/RQ9is0OQCc
Let us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤🔥
MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m— UV Creations (@UV_Creations) August 21, 2025