MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమల్‌ హాసన్‌ చేయాల్సిన మూవీతో దారుణంగా దెబ్బతిన్న చిరంజీవి.. పట్టుబట్టి చేస్తే ఊహించని రిజల్ట్, కానీ

కమల్‌ హాసన్‌ చేయాల్సిన మూవీతో దారుణంగా దెబ్బతిన్న చిరంజీవి.. పట్టుబట్టి చేస్తే ఊహించని రిజల్ట్, కానీ

చిరంజీవి ఓ సినిమా విషయంలో పొరపాటు పడ్డారు. పట్టుబట్టి మరీ కె విశ్వనాథ్‌తో ఓ సినిమా చేశారు. కానీ దాని ఫలితం చిరుకి చేదు అనుభవాన్ని ఇచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 20 2025, 05:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి సినిమా అంటే థియేటర్లలో పండగే
Image Credit : Asianet News

చిరంజీవి సినిమా అంటే థియేటర్లలో పండగే

మెగాస్టార్‌ చిరంజీవి `ఖైదీ` చిత్రం తర్వాత వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. యాక్షన్‌, పాటలు, సెంటిమెంట్‌, ఎమోషన్స్, తన మార్క్ కామెడీని మేళవిస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మాస్‌ పాటలతో ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. అప్పట్లో చిరంజీవి సినిమాలంటే థియేటర్లలో పండగే పండగ. ఫ్యాన్స్ పాటలని బాగా ఎంజాయ్‌ చేసేవారు. మళ్లీ మళ్లీ పాటలను రిపీటెడ్‌గా వెయించుకుని డాన్సులు చేసేవారు. అలా దాదాపు రెండు దశాబ్దాలపాటు తన హవాచూపించారు చిరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్పు కోసం కంటెంట్‌ బేస్డ్ చిత్రాలు చేసిన చిరంజీవి
Image Credit : chiranjeevi instagram

మార్పు కోసం కంటెంట్‌ బేస్డ్ చిత్రాలు చేసిన చిరంజీవి

అయితే వరుసగా సేమ్‌ సినిమాలు రిపీట్‌ అవుతున్నాయి. ఒకేతరహా సినిమాలు చేయాల్సి వస్తోందని చెప్పి ఆయన రూట్‌ మార్చారు. మధ్య మధ్యలో ఒకటి అర కంటెంట్‌ బేస్డ్, ఆర్ట్ తరహా సినిమాలు చేశారు. చిరంజీవి అంటే కమర్షియల్‌ హీరోగా ముద్ర పడింది. కానీ ఆయన ఆ ఇమేజ్‌ నుంచి బయటపడాలని చెప్పి కంటెంట్‌, ఎమోషనల్‌ మూవీస్‌ చేశారు. `శుభలేఖ`, `స్వయంకృషి` వంటి చిత్రాల తర్వాత కె విశ్వనాథ్‌తో `ఆపద్బాంధవుడు` చిత్రం చేశారు. వీరి కాంబోలో వచ్చిన మూడో చిత్రమిది.

35
కమల్‌ హాసన్‌తో చేయాల్సిన `ఆపద్భాంధవుడు`
Image Credit : prime video

కమల్‌ హాసన్‌తో చేయాల్సిన `ఆపద్భాంధవుడు`

అయితే ఈ సినిమా కమల్‌ హాసన్‌ కోసం అనుకున్నాడు దర్శకుడు కె విశ్వనాథ్‌. కమల్‌ అప్పట్లో చాలా టాప్‌లో ఉన్నారు. రజనీకాంత్‌ని మించిన స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. అంతేకాదు కె విశ్వనాథ్‌తో మంచి ర్యాపో ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది. అందులో భాగంగానే కమల్‌ హాసన్‌ కోసం `ఆపద్బాంధవుడు` స్క్రిప్ట్ రాసుకున్నారు విశ్వనాథ్‌. అయితే అప్పట్లో మార్పు కోసం చిరంజీవి ఇలాంటి కథల కోసం చూస్తున్నారు. విశ్వనాథ్‌తోనూ ఇలాంటి చర్చ జరిగింది. దీంతో కమల్‌ తో చేయడానికి ముందే చిరంజీవితో చర్చ జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ఈ స్క్రిప్ట్ గురించి డిస్కషన్‌ జరిగింది.

45
`ఆపద్భాంధవుడు` తో ప్రశంసలందుకున్న చిరంజీవి
Image Credit : Getty

`ఆపద్భాంధవుడు` తో ప్రశంసలందుకున్న చిరంజీవి

కమల్‌ తో ఈ సినిమా చేస్తున్నానని విశ్వనాథ్‌ చెప్పడంతో తాను చేస్తానని పట్టుబట్టాడట చిరు. ఇలాంటి సినిమాలు చేయాలని ఉందని తన ఆసక్తిని వెల్లడించారు. అలా `ఆపద్బాంధవుడు` మూవీ చిరంజీవి చేశారు. మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. ఆద్యంతం ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఇది భారీ అంచనాల మధ్య 1992 అక్టోబర్‌ 9న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రారంభం నుంచి మిశ్రమ స్పందనలభించింది. చిరుని ఇలాంటి ఫైట్లు, పాటలు, డాన్సులు లేని సినిమాలో ఫ్యాన్స్ చూడలేకపోయారు. దీంతో ఫలితం తేడా కొట్టింది. అయితే ఇందులో చిరంజీవి నటనకు నంది అవార్డులు వరించాయి. పలు ఇతర పురస్కరాలు దక్కించుకుంది. కానీ కమర్షియల్‌గా ఇది ఆడలేదు. ఇలా కమల్‌ హాసన్‌ చేయాల్సిన మూవీని చిరంజీవి చేసి బోల్తా పడ్డాడు. కాకపోతే ఈ మూవీలో చిరంజీవి నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. నంది అవార్డు కూడా వరించింది.

55
బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో రాబోతున్న మెగాస్టార్‌
Image Credit : Asianet News

బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో రాబోతున్న మెగాస్టార్‌

ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ రూపొందుతుంది. వశిష్ట దర్శక్వతం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శక్వంలో చిరంజీవి మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతుంది. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
బిగ్‌ బాస్‌ తెలుగు 9 `అగ్నిపరీక్ష`లో మతిపోయే రూల్స్.. అవి ఫాలో అయితేనే కంటెస్టెంట్లుగా ఛాన్స్
Recommended image2
సావిత్రికి మరో వ్యక్తితో సంబంధం ఉంది.. మా కుటుంబాన్ని నాశనం చేసింది.. జెమిని గణేషన్‌ కూతురు బోల్డ్ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved