MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి, వెంకీ, నాగ్ ముగ్గురూ ఆ తేదీని జీవితంలో మరచిపోలేరు.. ఏం జరిగిందంటే..

చిరంజీవి, వెంకీ, నాగ్ ముగ్గురూ ఆ తేదీని జీవితంలో మరచిపోలేరు.. ఏం జరిగిందంటే..

చిత్ర పరిశ్రమలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. సెంటిమెంట్లకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరూ అతీతులు కారు. టాలీవుడ్ సెలెబ్రెటీలకు పాజిటివ్ గా వర్కౌట్ అయిన సెంటిమెంట్లు, అలాగే చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సెంటిమెంట్లు ఉంటాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 25 2024, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చిత్ర పరిశ్రమలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. సెంటిమెంట్లకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరూ అతీతులు కారు. టాలీవుడ్ సెలెబ్రెటీలకు పాజిటివ్ గా వర్కౌట్ అయిన సెంటిమెంట్లు, అలాగే చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సెంటిమెంట్లు ఉంటాయి. ఒక సెంటిమెంట్ మాత్రం టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు బలంగా వర్కౌట్ అయింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Chiranjeevi

Chiranjeevi

ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.చిత్ర పరిశ్రమలో సంక్రాంతి తమ సినిమా రిలీజ్ చేయాలని చాలా మంది హీరోలు పోటీ పడుతుంటారు. సంక్రాంతి కాకుండా టాలీవుడ్ లో చాలా మందికి ఇష్టమైన తేదీ మరొకటి ఉంది. అదే మే 9. ఈ తేదికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ తేదీని మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తో పాటు కీర్తి సురేష్ కూడా జీవితంలో మరచిపోలేదు. 

 

35

మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మే 9 న విడుదలయింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో ఈ మూవీ ఒకటిగా నిలిచింది. ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి గుర్తింపు ఉంది. ఈ చిత్రం రిలీజ్ అయిన టైంలో ఏపీలో తీవ్రమైన ఫాన్ విజృంభిస్తోందట. తొలి మూడు రోజుల వరకు సినిమా పరిస్థితి ఏంటి అన్నది నిర్మాత అశ్విని దత్ కి కూడా తెలియదట. 

 

45

మూడవ రోజు తర్వాత నుంచి తుఫాన్ ప్రభావం తగ్గడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల తుఫాన్ మొదలైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1990లో ఈ చిత్రం విడుదలయింది. విక్టరీ వెంకటేష్ కి కూడా మే 9 మెమొరబుల్ డేట్ అని చెప్పొచ్చు. 1997 మే 9న విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాం రా చిత్రం విడుదలయింది. ఈ మూవీ కూడా తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

 

55

ఆ ఏడాది టాలీవుడ్ లో ఈ చిత్రమే బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రంలో వెంకీ, అంజల జవేరి జంటగా నటించారు. జయంత్ సి పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2002లో నాగార్జున నటించిన సంతోషం చిత్రం ఇదే తేదీన విడుదలైంది. ఆ టైంకి సంతోషం చిత్రం నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. చిరు, వెంకీ, నాగార్జున మాత్రమే కాదు కీర్తి సురేష్ కి కూడా మే 9 చాలా లక్కీ. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది. ఈ చిత్రానికి ఆమె ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved