నాగార్జున , చిరంజీవి కాంబినేషన్ లో మిస్సైన రెండు సినిమాలు ఏంటో తెలుసా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఈ ఇద్దరి కాంబినేషన్ లో రెండు భారీ మల్టీ స్టారర్ సినిమాలు మిస్ అయ్యాయని మీకు తెలుసా. దాదాపు ఫిక్స్ అయ్యి ఆగిపోయిన ఆ రెండు సినిమాలు ఏంటి?

ఇద్దరు స్టార్ హీరోలు
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని 90వ దశకంలో నిలబెట్టిన నలుగురు హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఉన్నారు. వీరితో పాటు బాలకృష్ణ, వెంకటేష్ కూడా టాలీవుడ్ ను ఏలారు. అయితే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి , కింగ్ నాగార్జున ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ వ్యక్తిగతంగా మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే గతంలో వీరిద్దరితో కలిసి రావాల్సిన రెండు మల్టీస్టారర్ సినిమాలు ప్రారంభ దశలోనే ఆగిపోయిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఈవీవీ డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ మిస్
మొదటి సినిమా విషయానికొస్తే, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 1990లో చిరంజీవితో చేసిన 'అల్లుడా మజాకా' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత నాగార్జునతో 'హలో బ్రదర్' అనే బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించాడు. ఈ రెండు విజయాల అనంతరం ఈవీవీ, చిరంజీవి–నాగార్జున కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కథను కూడా సిద్ధం చేసుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేకపోయింది. ఇది చిరు–నాగ్ కాంబోలో మిస్సైన తొలి సినిమా.
షూటింగ్ వరకూ వచ్చి ఆగిపోయింది
రెండో సినిమా విషయానికి వస్తే, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ ఇద్దరు స్టార్స్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం కథను సిద్ధం చేసి, ఇద్దరికీ వినిపించాడు. చిరంజీవి , నాగార్జున ఇద్దరికి కథ నచ్చడంతో, సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అంతే కాదు ఇంకాస్త ముందడుగు వేసి హీరోయిన్ గా హీరోయిన్ సౌందర్యను కూడా ఎంపిక చేశారు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది, దాదాపు 10 శాతం వరకూ పూర్తయ్యిందట.
మిస్ అయిన రెండు మల్టీ స్టారర్స్
అయితే సినిమా కథ పూర్తిగా చిరంజీవికి సరిపోదని, ఇది ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం తక్కువగా ఉందని రాఘవేంద్రరావుకు అనిపించింది. ఈ విషయాన్ని నాగార్జునతో చర్చించగా, "మీకే నమ్మకం లేకపోతే సినిమాను వదిలేయడం మంచిది" అని నాగార్జున సూచించారట. చిరంజీవి కూడా ఇదే అభిప్రాయంతో ఒప్పుకోవడంతో, ఈ ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే నిలిచిపోయింది. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని ఇలా రెండు మల్టీ స్టారర్ సినిమాలు మాత్రం వీరి కాంబోలో మిస్ అయ్యాయి అని సమాచారం.
ఎదురు చూస్తున్న అభిమానులు
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున కలిసి నటించాల్సిన రెండు పెద్ద మల్టీస్టారర్ సినిమాలు కొన్ని కారణాల వల్ల ఎటువంటి అప్ డేట్ లేకుండానే ఆగిపోయాయి. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ కలయిక ఇప్పటికైనా తెరపై కనిపిస్తే బాగుండేది అనే ఆకాంక్ష మాత్రం ఫ్యాన్స్ లో కలుగుతోంది. నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్స్ వైపు వెళ్తున్నారు. కుబేర,కూలీ సినిమాలు రీసెంట్ గా చేశారు. గతంలో సీతారామరాజు, ఊపిరి, లాంటి మల్టీ స్టారర్ సినిమాలు కూడా ఆయన చేశారు. ముందు ముందు చిరంజీవితో మంచి సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.