- Home
- Entertainment
- చెప్పులు కుట్టడం నేర్చుకున్న చిరంజీవి, ఊరికే మెగాస్టార్ అయిపోతారా ఏంటి అంటూ కామెంట్స్
చెప్పులు కుట్టడం నేర్చుకున్న చిరంజీవి, ఊరికే మెగాస్టార్ అయిపోతారా ఏంటి అంటూ కామెంట్స్
చిరంజీవి 38 ఏళ్ల క్రితం చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు. ఓ మనిషిని పిలిపించుకుని మరీ పక్కాగా ట్రైయింగ్ తీసుకున్నారు చిరు. ఒక సినిమా కోసం ఆయన ఇంత రిస్క్ ఎందుకు చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి?

టాలీవుడ్ లో మెగా జర్నీ
మెగాస్టార్ చిరంజీవి నటన అంటే ప్రాణం, డాన్స్ ఆయన శ్వాస, చిరంజీవి పడ్డ కష్టం, చేసిన కృషి ఆయన్ను ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలబెట్టింది. టాలీవుడ్ కు వెస్ట్రన్ స్టెప్పులు పరిచయం చేసిన హీరో మెగాస్టార్. మైకేల్ జాక్సన్ స్టెప్పులను తెలుగు ఆడియన్స్ కు చూపించిన హీరో చిరంజీవి. అప్పట్లో చిరు డాన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. యాక్షన్, డాన్స్, సెంటిమెంట్, ఏదైనా సరే చిరంజీవి అలవోకగా చేసేవారు. పాత్ర కోసం ఎంత రిస్క్ చేయడానికైనా మెగాస్టార్ వెనకాడలేదు. ఎటువంటి పాత్ర అయినా దానికి హోమ్ వర్క్ చేసి, ఆ సినిమా కంప్లీట్ అయ్యేవరకూ అందులోనే జీవించేవారు చిరు.
పాత్ర కోసం రిస్క్ లు
ఆ డెడికేషన్ చిరంజీవిని ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. సినిమాలు పాత్రల విషయంలో చిరంజీవి డెడికేషన్ కు సబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవి ఓ సినిమా కోసం పడిన కష్టం గురించి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన తీరు మెగా ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తోంది. చిరంజీవి సినిమాల్లో ఎవర్ గ్రీన్ మూవీస్ కొన్ని ఉన్నాయి. అందులో స్వయంకృషి కూడా ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టుకునే పేద వ్యక్తిగా నటించారు. అందులో ఆయన చెప్పులు కుట్టడం చాలా ప్రొఫిషనల్ గా చేశారు. నిజంగా రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునేవారి యాటిట్యూడ్ ను ఆయన పక్కాగా చేసి చూపించారు.
చెప్పులు కుట్టడం నేర్చుకున్న మెగాస్టార్
అయితే చిరంజీవికి అది ఎలా సాధ్యం అయ్యింది. ఈ విషయాన్నే యాంకర్ చిరంజీవిని ప్రశ్నించారు. ఆ ఇంటర్వ్యూలో ఈసినిమా డైరెక్టర్ కె విశ్వనాథ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ పాత్ర కోసం చెప్పులు కుట్టే పనిని నేర్చుకున్నానని చిరంజీవి వెల్లడించారు. అందుకోసం ఓ మనిషిని పిలిపించుకుని ప్రాక్టీస్ చేశానన్నారు మెగాస్టార్. అంతే కాదు దారం చుట్టడం, కత్తి సానపట్టడం, ఇలా ఆ వృత్తికి సబంధించిన ప్రతీ పని కష్టంతో కూడుకున్నది. చెప్పులు కుట్టేవారు తమ పని చేసుకుంటూ మాట్లాడుతుంటారు. అది పక్కాగా చేయగలిగితే పాత్ర సరిగ్గా వచ్చినట్టు. అందుకోసం నేను చాలా కష్టపడ్డాను, పక్కాగా చెప్పులు కుట్టడం నేర్చుకున్నాను అని చిరంజీవి అన్నారు.
ఊరికే మెగాస్టార్ అయిపోరు కదా..!
ఈ ఇంటర్వ్యూ వీడియోకు రకరకాల కామెంట్లు వచ్చాయి. అంత కష్టపడ్డాడు కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు అని ఒకరు, ఊరికే మెగాస్టార్ అయిపోతారా ఏంటి అని మరొకరు, చిరంజీవి గ్రేట్ యాక్టర్, ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కు వచ్చారని మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఇక కె. విశ్వనాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన స్వయంకృషి సినిమా 1987 లో రిలీజ్ అయ్యి , బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు విజయశాంతి, సుమలత, సోమయాజులు లాంటి సినియర్స్ నటించారు. ఇక ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి అదే జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
70 ఏళ్ల వయసులోను అదే జోరు
మెగాస్టార్ నటించిన విశ్వంభర రిలీజ్ కు రెడీగా ఉంది. గ్రాఫిక్స్ పనులు పెండింగ్ ఉండటంతో ఈసినిమా రిలీజ్ లేట్ అవుతోంది. ఈలోపు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో చిరంజీవి మన శంకరవరప్రసాద్ సినిమాను చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈసినిమా, వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈరెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండగా.. తనకు హిట్ సినిమా అందించిన డైరెక్టర్ బాబీతో మరోసినిమాను కమిట్ అయ్యారు చిరు. త్వరలో ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.