చిరంజీవి ఆ రోజు మాత్రం నేలమీదనే పడుకుంటాడు, ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు
సినిమా ఈవెంట్లు అయిపోయాక చిరంజీవి ఇంటికెళ్లి ఏం చేస్తాడో తెలుసా? మెగాస్టార్ ఇమేజ్ ఉన్న ఆయన చేసే పని తెలిస్తే మతిపోవాల్సిందే. వామ్మో మెగాస్టార్ ఊరికే అయిపోరు.
మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా, నటుడిగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన్ని మించిన హీరో ఇప్పుడు లేడు, ఇప్పట్లో రాదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అది కేవలం సినిమా విజయాలు, భారీ బడ్జెట్, కలెక్షన్లు, ఇమేజ్ కి మాత్రమే పరిమితం కాదు, అంతకు మించినది చాలా ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా, నటుడిగా, డాన్సర్‌గా, స్టార్‌గా, గొప్పటి వ్యక్తిత్వం, సేవలు ఇవన్నీ కలిపితే మెగాస్టార్. అందుకే టాలీవుడ్‌లో ఆయనే ఎప్పటికీ మెగాస్టార్.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
అంతటి మెగాస్టార్ కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఓ మచ్చు తునక ఆయన నేల మీద పడుకోవడం. లగ్జరీ లైఫ్, కోట్లకు అధిపతి అయి ఉండి నేలపై పడుకోవడమేంటనే డౌట్ రావచ్చు. అక్కడే ఓ ట్విస్ట్, ప్రత్యేకత ఉంది. అదేంటనేది చూస్తే, చిరంజీవి సినిమా ఈవెంట్లు, సక్సెస్ సెలబ్రేషన్ అయిపోయాక ఆయన ఇంటికెళ్లి నేల మీద పడుకుంటాడట. దానికి కారణం చెప్పారు చిరు. సినిమాల ఈవెంట్లలో తమని సినీ ప్రముఖులు ఆహా, ఓహో అని పొడుగుతుంటారని, ఆకాశానికి ఎత్తేస్తారని మమ్మల్ని మించిన హీరో లేరనేలా మాట్లాడుతుంటారు, రియల్ హీరోని చేస్తుంటారు.
అలాగే అభిమానులు సైతం అదే స్థాయిలో ప్రేమ, ఆదరణని చూపిస్తారు. ఇంతగా ఆదరిస్తుంటే, ప్రేమిస్తుంటే మా కంటే గొప్పవాళ్లు ఎవరూ లేరని తాము భావిస్తుంటామని, నిజంగానే హీరోలా ఫీలవుతామని, కాసేపు మమ్మల్ని మేము మర్చిపోతామని తెలిపారు చిరంజీవి. అయితే ఈ అభిమానం, ప్రేమని ఎప్పుడూ తలకెక్కించుకోనని,
అందుకే ఇలాంటి సినిమా ఈవెంట్లు పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి నేలపై పడుకుంటానని, ఆ రోజు నేలపైనే నిద్ర పోతానని, ఇంతగా ఆదరిస్తున్నారంటే ఆ గొప్పతనం తమది కాదని, మీదే అని అన్నారు. మీరు చూపించే ప్రేమ, అభిమానం ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటానని, అంతేకానీ తలకెక్కించుకోనని, అందుకే ఇంటికెళ్లి నేలపైనే పడుకుంటానని చెప్పారు చిరు.
`ఇంద్ర` సినిమా ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని చెప్పడం విశేషం. ఇటీవల `ఇంద్ర` సినిమాని రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా `ఇంద్ర` సినిమా ఆడియో ఈవెంట్ వీడియోని విడుదల చేసింది టీమ్. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇందులో చిరంజీవి చెప్పిన విషయాలు మరింత వైరల్‌గా మారాయి. చిరంజీవి గొప్పతనానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ ఈవెంట్‌కి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా రావడం విశేషం. ఆయనతోపాటు అనేక మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.
ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. ఆయన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో ఒకటైన `జగదేక వీరుడు అతిలోక సుందరి` స్టయిల్‌లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సోషియో పాంటసీగా ఎలిమెంట్లతో, ప్రస్తుత కాలానికి, ఫాంటసీ ఎలిమెంట్లని ముడిపెడుతూ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ట. ఆయన గత చిత్రం `బింబిసార`ని కూడా అదే స్టయిల్‌లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు `విశ్వంభర`ని కూడా అదే మాదిరిగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. ఆమెతోపాటు మీనాక్షి చౌదరి, సురభీ, ఈషా చావ్లా వంటి హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం, సీజీ వర్క్ డిలే కారణంగా సంక్రాంతి బరి నుంచి ఈ మూవీ తప్పుకున్నట్టు తెలుస్తుంది.
Also read: Vettaiyan Movie Review: రజనీకాంత్ `వేట్టయన్` మూవీ రివ్యూ, రేటింగ్