- Home
- Entertainment
- Mega154: 'వాల్తేరు వీరయ్య' స్టోరీ లీక్ ?.. చిరంజీవి, రవితేజ పాత్రల్లో షాకింగ్ ట్విస్ట్..
Mega154: 'వాల్తేరు వీరయ్య' స్టోరీ లీక్ ?.. చిరంజీవి, రవితేజ పాత్రల్లో షాకింగ్ ట్విస్ట్..
ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద దెబ్బే తగిలింది. చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య చిత్రం అత్యంత ఘోర పరాజయంగా నిలిచిపోయింది. దీని నుంచి బయట పడి ఫ్యాన్స్ కి ఎలాగైనా ఒక సూపర్ హిట్ ఇవ్వాలని చిరు భావిస్తున్నారు.

ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద దెబ్బే తగిలింది. చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య చిత్రం అత్యంత ఘోర పరాజయంగా నిలిచిపోయింది. దీని నుంచి బయట పడి ఫ్యాన్స్ కి ఎలాగైనా ఒక సూపర్ హిట్ ఇవ్వాలని చిరు భావిస్తున్నారు. ఇటీవల లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ లో కూడా చిరు ఇదే విషయాన్ని చెప్పారు. నా చేతిలో లేకుండా కొన్ని విషయాలు జరిగిపోతుంటాయి.
ఇక నుంచి అభిమానులు కోరుకునే సినిమాలే చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్న చిత్రం 'మెగా 154'(వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్ర కథ గురించి అప్పుడే లీకులు మొదలయ్యాయి.
దర్శకుడు బాబీ చిత్రాల్లో ఊర మాస్ కమర్షియల్ అంశాలు తప్పకుండా ఉంటాయి. కానీ మెగా 154లో బాబీ బలమైన కథ కూడా చెప్పబోతున్నారట. సముద్రం ఒడ్డున జరిగే మత్స్యకారుడి కథ ఇది. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజని కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకోవడం వెనుక బలమైన కారణం. కేవలం హైప్ కోసం మాత్రమే రవితేజని ఈ చిత్రంలోకి తీసుకోలేదట.
కథ డిమాండ్ చేయడంతో రవితేజనే పట్టు బట్టి ఎంపిక చేసుకున్నారు. చిరంజీవి, రవితేజ ఈ చిత్రంలో అన్నదమ్ములుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ సవతి తల్లి బిడ్డలుగా కనిపిస్తారట. సవతి తల్లి బిడ్డలు కాబట్టి వారి మధ్య ఎంతోకొంత వైరం ఉంటుంది. దీనితో బాబీ ఎమోటినల్ గాపవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నట్లు టాక్.
రవితేజ కెరీర్ ఆరంభం నుంచి చిరంజీవిని తన అన్నయ్యగానే భావిస్తాడు. అన్నయ్య చిత్రంలో చిరంజీవితో కలసి నటించాడు కూడా. దీనితో చిరంజీవి సవతి తల్లి తమ్ముడిగా రవితేజ పర్ఫెక్ట్ యాప్ట్ అని బాబీ అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి పాత్రల్లో కథలో భాగంగా ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతాయని అంటున్నారు.
అయితే రవితేజ పాత్ర సినిమా మొత్తం ఉంటుందా అనేది సస్పెన్స్. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.