- Home
- Entertainment
- లావణ్య ప్రేమ విషయం నా వద్ద దాచాడు, అదే నా కోపం.. వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై చిరంజీవి ఫస్ట్ టైమ్ రియాక్షన్
లావణ్య ప్రేమ విషయం నా వద్ద దాచాడు, అదే నా కోపం.. వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై చిరంజీవి ఫస్ట్ టైమ్ రియాక్షన్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గతేడాది నవంబర్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి లవ్ స్టోరీపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రేజీ కామెంట్ చేశారు.

మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వరుణ్ తేజ్. `ముకుందా` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. కరెక్ట్ గా పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్నాడు. `కంచె` చిత్రంతో క్రిటికల్‌గా ప్రశంసలందుకున్నాడు. ఆ తర్వాత `ఫిదా`తో కమర్షియల్ హిట్ అందుకుని తొలి బ్రేక్ సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే `తొలిప్రేమ`తో మరో సక్సెస్ కొట్టాడు. `ఎఫ్2, `ఎఫ్3`తో మెప్పించిన ఆయన ఇప్పుడు `ఆపరేషన్ వాలెంటైన్` చిత్రంతో రాబోతున్నాడు.
`ఆపరేషన్ వాలెంటైన్` మూవీ మార్చి 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ నిర్వహించారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో టీమ్ ఆయన్ని సత్కరించింది. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా చిరంజీవికి కొన్ని ప్రశ్నలు వేసింది యాంకర్ సుమ. అందులో వరుణ్ తేజ్ ప్రేమ విషయాన్ని ప్రస్తావించింది. `చిరు లీక్స్` అంటే మాకు చాలా ఇష్టం. మాకు వరుణ్ లవ్ లీక్ ఇవ్వలేదు, ఆ లీక్ మీకు రాలేదా? అన్ని ప్రశ్నించింది సుమ.
ఈ నేపథ్యంలో మొదటిసారి వరుణ్ లవ్ స్టోరీపై చిరంజీవి స్పందించారు. వరుణ్ తేజ్ నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడు. వాళ్ల నాన్నకి చెప్పలేనివి కూడా నాతో చెబుతుంటాడు. నేనే ఇన్ స్పిరేషన్ అంటుంటాడు, అన్నీ చెబుతాడు, కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నా వద్ద దాచాడు. అదే నాకు కోపంగా ఉంటుంది` అని చిరంజీవి రియాక్ట్ అయ్యాడు. దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ, భయంతో కూడిన గౌరవమని, అయితే తన లవ్ విషయాన్ని ముందు పెదనాన్నతోనే చెప్పినట్టు వెల్లడించాడు వరుణ్. ఈ కాన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈసందర్భంగా మరికొన్ని విషయాలను పంచుకున్నారు చిరు. వరుణ్ తేజ్ పై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. చిన్నప్పటి వరుణ్ ఫోటోని చూపించగా, అందులో చిరు, నాగబాబు, పవన్‌ల మధ్యలో వరుణ్ తేజ్ ఉన్నాడు. దీనిపై స్పందిస్తూ, తాను కూడా స్టార్ అవుతానని, నటుడిని అప్పుడే అనుకున్నాడేమో అలా కూర్చొన్నాడని చెప్పాడు. వరుణ్ తొలి సినిమా నా చిత్రమే అని వెల్లడించాడు. ముకుందా సమయంలో తాను మాట్లాడిన మాటలపై ఆయన స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశాడు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన `ఆపరేషన్ వాలెంటైన్స్` మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఎయిర్ ఫోర్స్ బేస్డ్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఎయిర్‌ఫోర్స్ అధికారిగా ఇందులో వరుణ్ కనిపిస్తున్నాడు. ఇందులో మనూషీ చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. నవదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మార్చి 1న ఈ చిత్రం రాబోతుంది. వరుస పరాజయాల్లో ఉన్న వరుణ్ ఈ మూవీతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.