- Home
- Entertainment
- Acharya Story Leaked: ఆచార్య కథలో అసలు ట్విస్ట్ అదే... ట్రైలర్ లో హింట్ ఇచ్చిన కొరటాల
Acharya Story Leaked: ఆచార్య కథలో అసలు ట్విస్ట్ అదే... ట్రైలర్ లో హింట్ ఇచ్చిన కొరటాల
ఆచార్య ట్రైలర్ (Achrya Trailer) అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సాగింది. దర్శకుడు కొరటాల మరో బ్లాక్ బస్టర్ ఆచార్య రూపంలో అందుకోనునట్లు అర్థమైంది. చిరు-చరణ్ (Ram Charan) లు సిల్వర్ స్క్రీన్ పై చెలరేగిపోనున్నట్లు స్పష్టంగా అర్థమైంది. అదే క్రమంలో ట్రైలర్ తో దర్శకుడు కొరటాల కథపై ఓ హింట్ ఇచ్చారు.

Acharya Trailer
ఆచార్య మూవీ (Acharya Movie)ధర్మస్థలి అనే ఓ పుణ్యక్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ. పచ్చని అడవుల్లో అమ్మవారు కొలువైన ధర్మస్థలిని కాపాడడానికి అక్కడి పల్లె ప్రజలు ఉంటారు. వారిలో ఒకడు సిద్ధ. ధర్మస్థలి ప్రజల తలలో నాలికలా వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ ఉండే సిద్ధ, ఎవరైనా నీచ బుద్ధితో ధర్మస్థలిని టచ్ చేయాలని చూస్తే... వారి అంతు చూస్తాడు.
Acharya Trailer
అలాంటి సిద్ధ ధర్మస్థలిని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. పుట్టిన ఊరిని, ప్రజలను, ప్రేయసిని వదిలి వెళ్ళిపోతాడు. సిద్ధ లేని ధర్మస్థలిలో దుర్మార్గుల అరాచకాలు ఎక్కువైపోతాయి. అక్కడి ప్రజలకు, ధర్మస్థలికి రక్షణ లేకుండా పోతుంది. అన్యాయాలు పతాక స్థాయికి చేరి జనాలు ఆశలు కోల్పోతున్న తరుణంలో ఆచార్య రంగ ప్రవేశం చేస్తాడు.
Acharya Trailer
ధర్మస్థలిలో అక్రమాలు చేస్తున్న దుర్మార్గుల పని పడతారు. వాళ్ళ ఆటలకు చెక్ పెడతాడు . నక్సలైట్ అయిన ఆచార్యకు ధర్మస్థలి గురించి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి సిద్ధ చెబుతాడు. సిద్ధ కోరిక మేరకు ధర్మస్థలికి ఆచార్య వస్తాడు.
Acharya Trailer
అసలు సిద్ధ ధర్మస్థలిని వదిలి నక్సలైట్స్ లో ఎందుకు చేరాడు. దానికి కారణం ఏమిటీ? ధర్మస్థలిని కాపాడడానికి అతడు మరలా తిరిగి ఎందుకు రాలేదు? నక్సలైట్స్ గా కలిసి పోరాటం చేసిన సిద్ధ, ఆచార్య ధర్మస్థలి రక్షణ పోరాటంలో కలిసిపాల్గొన్నారా? సిద్ధ మరలా ధర్మస్థలికి వస్తాడా? ఒకవేళ రాకుంటే అతడు ఏమయ్యాడు? అనేది ఆచార్య కథలో ట్విస్ట్ అని తెలుస్తుంది.
Acharya Trailer
ఆచార్య ట్రైలర్ చూసిన టాలీవుడ్ వర్గాలు ఈ విధంగా కథను అంచనా వేస్తున్నాయి. మరి ప్రచారం అవుతున్న ఈ కథలో ఎంత వరకు నిజం ఉందనేది మూవీ విడుదలైతే కానీ తెలియదు.
Acharya Trailer
సోనూ సూద్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, అజయ్, నాజర్ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నారు.
Acharya Trailer
ఇక కొరటాల శివ గత చిత్రాల మాదిరి ఆచార్య సైతం మంచి సోషల్ మెసేజ్ కలిగి ఉంటుందని సమాచారం. సోషల్ సబ్జెక్ట్ కి కమర్షియల్ అంశాలు జోడించి ఆచార్య తెరకెక్కించారు.
Acharya Trailer
ఇక చాలా కాలం తర్వాత చిరంజీవి (Chiranjeevi)చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ ఆయన అందించిన బీజీఎం అద్భుతం ఉంది. విడుదలైన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
Acharya Trailer
కొణిదెల ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఆచార్య నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా ఆచార్య వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది.