- Home
- Entertainment
- Chiru v/s Devi Nagavalli:మెగాస్టార్ ని వదలని దేవి నాగవళ్లి.. వీడియో ఎడిట్ చేసి ఆడుకున్నారంటూ చిరు ఆవేదన
Chiru v/s Devi Nagavalli:మెగాస్టార్ ని వదలని దేవి నాగవళ్లి.. వీడియో ఎడిట్ చేసి ఆడుకున్నారంటూ చిరు ఆవేదన
టీవీ9 యాంకర్ దేవి నాగవళ్లి పేరు మారుమోగుతుంది. ఆమెతో చిట్‌చాట్‌లో హీరోలు పాపులర్ అవ్వడంతోపాటు ఇప్పుడు ఆమె పేరు కూడా వైరల్ అవుతుంది. అయితే ఆమె బాధితుల్లో చిరంజీవి కూడా ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇటీవల టీవీ9 స్టూడియోలో యాంకర్‌గా ఉన్న దేవి నాగవళ్లి(Devi Nagavalli) సమక్షంలో విశ్వక్ సేన్(Vishwak Sen) విషయంలో జరిగిన ఘటన ఎంతగా దుమారం రేపిందో తెలిసిందే. ఇప్పటికీ అది వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్‌లో దేవిదే తప్పు అని అటు నెటిజన్లు, ఇటు క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా దేవి అడ్డంగా బుక్కయిపోయిందంటున్నారు. ఈ క్రమంలో అనేక పాత విషయాలు బయటకు వస్తున్నాయి.
గతంలో `అర్జున్‌రెడ్డి` సినిమా సమయంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో చేసిన చిట్ చాట్ విషయంలోనూ దేవి వేసిన ప్రశ్నలు, దానికి విజయ్ సమాధానం, అనంతరం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రౌడీబాయ్ తన బోల్డ్ నెస్‌తో ఆడుకోగా, దాన్ని దేవి సైతం అంతే బోల్డ్ గా స్పందించడం,ఫైనల్‌గా అది దుమారం రేపి, అనంతరం సినిమా హిట్‌తో విజయ్ స్టార్ హీరో అయిపోవడం చక చకా జరిగిపోయాయి. మరోవైపు ఆ మధ్య సిద్దు జొన్నలగడ్డ కూడా దేవి బాధితుడిగానే ఉన్నాడు. వీరంతా దేవితో జరిగిన వివాదం అనంతరం పాపులర్ అయిపోవడం విశేషం. విశ్వక్ సేన్ విషయంలో అదే జరిగింది. ఓ రకంగా దేవి హీరోలకు ఇండైరెక్ట్ గా మంచే చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
అయితే ఈ క్రమంలోనే కొన్నిపాత వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారుతుండటం విశేషం. అందులో భాగంగా చిరంజీవి(Chianjeevi) వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దేవి చేసిన పనిని చిరంజీవి చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో దేవి బాధితుల్లో చిరంజీవి కూడా ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. కరోనా మొదటి వేవ్ సమయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శానిటైజర్ ప్రముఖ్యతని వెల్లడిస్తూ, కరోనా టైమ్‌లో ముందుండి పోరాడిన వారిని అభినందించే కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు.Chiru V/S Devi nagavalli.
`ప్రజా రాజ్యం` పార్టీ పెట్టినప్పుడు ప్రజా అంకిత యాత్ర చేసే సమయంలో జరిగిన సంఘటనని ఇందులో గుర్తు చేశారు చిరు. ఒక చోట యాత్ర సందర్భంగా బస్సులో కూర్చొన్నప్పుడు ఒక వ్యక్తి ఖర్జూరాలు తినేందుకు ఇచ్చాడని.. అయితే తన చేతులను శుభ్రం చేసుకుని తిందామని చెప్పి శానిటైజర్ రాసుకున్నానని, తరువాత ఖర్జూరాలను తిన్నానని, అనంతరం ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇచ్చానని తెలిపారు. అయితే తాను ఖర్జూరాలను తినేందుకు శానిటైజర్‌ను రాసుకుంటే ఆ సంఘటనను వీడియోలో తీసేసి తాను శానిటైజర్ రాసుకున్నది, తరువాత షేక్ హ్యాండ్స్ ఇచ్చినది.. ఆ రెండు వీడియోలను మాత్రమే కలిపి ఎడిట్ చేశారని.. తరువాత ఆ వీడియోలను రిపీటెడ్‌గా అన్ని చానల్స్ ప్రసారం చేశాయని, అక్కడ జరిగిన అసలు విషయాన్ని వదిలేసి చిరంజీవి అలా చేశారని అనే విషయాన్నే వారు పదే పదే చూపించారని అన్నారు.
అయితే ఈ సంఘటన గురించి చిరంజీవి తరువాత జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. కాగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో చిరంజీవి ఆ సంఘటన గురించి చెబుతూ.. దేవి నాగవల్లిని ఉద్దేశించి మాట్లాడారు. `దేవీ.. నవ్వకు`.. అని అన్నారు. అంటే అప్పట్లో ఆమె ఆ చానల్‌లో ఉన్నప్పుడు ఆ సంఘటనలో ఆమెకు కూడా భాగం ఉందనే చిరంజీవి అలా అన్నారని స్పష్టమవుతోంది. తానంటే అప్పట్లో కొన్ని చానల్స్ కు ఎంతో ఇష్టం ఉండేదని, తాను ఎప్పుడు తప్పు చేసి దొరుకుతానా.. ఎప్పుడు వీడియోలను టెలికాస్ట్ చేద్దామా.. అని ఆ చానల్స్ వారు కాచుకుని కూర్చుని ఉండేవారని వారికి పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతుండటం విశేషం.