MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగబాబు కన్నా పవన్ పైనే ఎక్కువ ప్రేమకు చిరు చెప్పిన కారణం

నాగబాబు కన్నా పవన్ పైనే ఎక్కువ ప్రేమకు చిరు చెప్పిన కారణం

ఒకప్పుడు మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పవన్.. ఆ తర్వాత తన స్టైల్‌తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ అభిమానులే.  

2 Min read
Author : Surya Prakash
Published : Sep 25 2024, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
PAWAN, CHIRANJEEVI

PAWAN, CHIRANJEEVI

ఏ నేపధ్యం లేకుండా తన టాలెంట్ నే నమ్ముకుని సినీ  ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఆయన బాటలో ప్రయాణించిన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ సైతం అదే స్థాయిలో అభిమానులను సంపాదించారు. చిరంజీవి  తమ్ముడిగానే కాకుండా పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ రోజు ఆంద్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం స్దాయికి ఎదిగిరారు. తను స్దాపించిన జనసేన పార్టీని నిలబడిన ప్రతీ చోటా ఒంటిచేత్తో గెలిపించుకున్నారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనిపించుకున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

26

 చిరంజీవికి, పవన్ కు ఉన్న అనుబంధం విషయానికి రామ,లక్ష్మణులే గుర్తుకు వస్తారు అందరికీ. చిరంజీవి మీద చిన్న మాట పడనివ్వరు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూంటారు చిరంజీవి. పవన్ గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి కళ్ళలో ప్రత్యేకమైన ప్రేమ, ఆర్ద్రత కనపడుతూంటాయి.  

రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎలాగైతే ఆ కళ్లల్లో మెరుపు కనిపిస్తుందే అదే విధంగా పవన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జరుగుతుందని చూసిన వాళ్లు చెప్తూంటారు. అలాగే నాగబాబు ఉన్నా కూడా పవన్ విషయమే ఎక్కువగా చెప్తూంటారు చిరంజీవి. 

36


ఇదే విషయాన్ని ఓ షోలో చిరంజీవినే ఎందుకు మీకు నాగబాబు కూడా సోదరుడే అయినా  పవన్ పై ప్రత్యేకమైన ప్రేమ అని అడగటం జరిగింది. దానికి చిరంజీవి స్పందిస్తూ ...నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా చిన్నోడు.

మా పెళ్లినాటికి కూడా వాడు నాలుగో ,ఐదో చదువుతున్నాడు. ఆ వయస్సులో వాడు మా దగ్గర ఎక్కువ ఉండేవాడు. మా దగ్గర చదువుకున్నాడు. మద్రాస్ లో కొన్నాళ్లు మా ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత నెల్లూరు వెళ్లాడు. అదేంతో మా ఇంట్లో బిడ్డలాగ అనిపిస్తుంది. మా మొదటి బిడ్డలాగ ఉంటాడు అన్నారు చిరంజీవి. 
 

46
Pawan Kalyan Chiranjeevi

Pawan Kalyan Chiranjeevi


ముఖ్యంగా ఏంటంటే నేను , నాగబాబు, కొంతకాలం వరకూ మా మొదటి చెల్లి కలిసే ఉన్నాము. అయితే , మిగతా ఇద్దరూ మాధవి, కళ్యాణ్ పుట్టే సమయానికి నేను వేరే చోట చదువుకుంటూ ఉన్నాను. వీళ్లను హాలిడేస్ లో చూడటం తప్పించి ఎప్పుడు చూడలేదు. నేను వీళ్లని బాగా మిస్సైన ఫీలింగ్ నాకు. అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అని చెప్పుకొచ్చారు. 
 

56

పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించైనా స్పందిస్తే అలా స్పందించడం కరెక్ట్ అని తనకు అనిపిస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ న్యాయం కోసం పోరాడతాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. తాను కూడా అదే న్యాయం కొరకు మాట్లాడతానని చిరంజీవి అన్నారు. మన ఓపిక, మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం మనకు సక్సెస్ ను చేకూర్చి పెడతాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. 
 

66
pawan Kalyan,

pawan Kalyan,


పవన్ కళ్యాణ్.. తన అన్న చిరంజీవి మీద అభిమానం, ప్రేమ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటారు. తన అన్న వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని బహిరంగంగానే చాలాసార్లు తెలిపారు పవన్. అసలైతే తనకు హీరోగా మారాలన్న ఆలోచన మొదట్లో లేదని, కానీ అన్న కోసమే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టానని కూడా అన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పవన్.. ఆ తర్వాత తన స్టైల్‌తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ అభిమానులే.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved