మరో వివాదంలో సింగర్ శ్రీపాద చిన్మయి.. మండిపడుతున్న నెటిజన్లు..
ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని కదిలించి హడావిడి చేస్తుంటుంది సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. ఈమధ్య ఓ వివాదం సర్ధుమనిగింది అనుకుంటుండగా.. మరోసారి మరో వివాదాన్ని తానే కోరి కదిలించింది.

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. అయితే నెటిజన్ల ట్రోలింగ్స్ కు చిన్మయి కూడా ఘాటుగానే సమాధానం చెపుతుంది. ట్విట్కు రీట్విట్లు వేస్తూ.. హడావిడి చేస్తోంది. ఇంతకీ చిన్మయి చేసిన తప్పేంటి.. ఆమె ఎందుకు ట్రోలింగ్ కు గురవుతోంది.
ఇండియాను వీడటమే తన కల అన్న ఓ ఎన్నారై యువతికి మద్దతుగా నిలిచి.. ట్వీట్ చేయడంతో చిన్మయి చేయడంతో కాంట్రవర్సీ మొదలైంది. కెనడాలో చదువుకుంటున్న ఓ ఇండియన్ లేడీ.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. మీరు కెనడాకు ఎందుకు వచ్చారు? అని వీడియోలో ఆమెను అడగ్గా.. ఇండియాను వీడటమే తన కల అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఆమె.
కెనడాలో మీకు నచ్చింది ఏంటని అడగ్గా ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చని ఆమె అన్నది. అంతే కాదు ఈ వీడియో వైరల్ అవ్వడంతో అది చూసిన సింగర్ చిన్మయి ఈ వీడియోపై స్పందించింది. చిన్మయి ఆ యువతికి మద్దతు పలికింది. పరాయి దేశంలో కూడా ఆమె స్వేచ్ఛగా ఉండగలుగుతోంది. ఆమె చెప్పేదేంటో వింటే విషయం పూర్తిగా బోధపడుతుంది. ఆమె ఇండియా విడిచి వెళ్లగలిగినందుకు నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఇక్కడి స్త్రీలందరూ ఇలాగే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోగలిగితే బాగుండును అని ట్వీట్ చేశింది.
ఇండియాను వద్దు అంటూ.. ఫ్రీడం అని మాట్లాడిన ఆ యంగ్ లేడీకి చిన్మయి మద్దతు పలకడం నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో ఆమెపై ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియా జనాలు. నువ్వింకా దేశంలోనే ఉన్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బహుశా డబ్బులు పోగేసుకునేందుకు ఉన్నావేమో అంటూ మండిపడ్డారు.
ఇక్కడ మాత్రం వ్యక్తిగత భద్రతకంటే సంపాదనవైపే మొగ్గు చూపావేమో అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.. ఘాటుగా అనేస్తున్నారు. ఇక వీరి వ్యాఖ్యలకు ఆమె కూడా ఘాటుగానే సమాధానం చెపుతోంది. మంచి కెరీర్, డబ్బు సంపాదిస్తున్న వారిని చూసి నీ ఇగో హర్ట్ అయింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నువ్వు, ట్విట్టర్ కనుమరుగయ్యాక కూడా నేను పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి అన్నారు. అంతే కాదు ఇండియాలో సెక్యూరిటీ లేక దేశాన్ని వీడానని ఓ మహిళ అంటే ఇలా స్పందిస్తారా? అసలు ఇండియాను వీడి వెళ్లాల్సింది నువ్వే అంటు ట్రోలర్ కు చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.
<p>chinmayi2</p>
చిన్మయి శ్రీపాద. ఇలా వివాదాలను కోరి తెచ్చుకుంటుంది బ్యూటీ.. గతంలో కూడా ఇలానే చాలా విషయాల్లో వివాదం అయ్యింది శ్రీపాద. ఈ మధ్యే తమిళ రచయిత వైరిముత్తు విషయంలో.. ఏకంగా సీఎం స్టాలిన్ పైనే అసతృప్తి వెల్లడించింది చిన్మయి.. మీటు ఉద్యమంలో కూడా కీలకంగా వ్యావహరించింది. అంతే కాదు కాస్టింగ్ కౌచ్ పై గట్టిగా వాయిస్ వినిపించింది. ఇండస్ట్రీ కూడా చిన్మయిని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.