- Home
- Entertainment
- ఒక్కసారిగా ఛార్మి షాకింగ్ డెసిషన్, అసలు కారణం అదేనా.. పీకే ఫ్యాన్స్ రిక్వస్ట్, ఆడేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
ఒక్కసారిగా ఛార్మి షాకింగ్ డెసిషన్, అసలు కారణం అదేనా.. పీకే ఫ్యాన్స్ రిక్వస్ట్, ఆడేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
లైగర్ మూవీ విజయ్ దేవరకొండ, పూరి, ఛార్మిపై తీవ్ర ప్రభావమే చూపింది. లైగర్ సినిమా ఎఫెక్ట్ తో వీరి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన చిత్రం అటకెక్కింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Puri Jagannadh
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ కి దిగుతున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో లైగర్ ఒకటిగా నిలిచింది. లైగర్ మూవీ విజయ్ దేవరకొండ, పూరి, ఛార్మిపై తీవ్ర ప్రభావమే చూపింది.
లైగర్ సినిమా ఎఫెక్ట్ తో వీరి కాంబినేషన్ లోనే తెరకెక్కాల్సిన జనగణమన చిత్రం అటకెక్కింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఛార్మి పూరి జగన్నాధ్ తో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతోంది. పూరితో కలసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్ స్థాపించిన పూరి కనెక్ట్స్ బ్యానర్ నిర్మాణ వ్యవహారాలు చూసుకునేది ఛార్మినే.
లైగర్ డిజాస్టర్ కావడం, జనగణమన ఆగిపోవడంతో పూరి, ఛార్మి ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాజాగా ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలతో ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాకి కొంతకాలం దూరం అవుతున్నట్లు ప్రకటించింది. 'చిల్ గాయ్స్.. సోషల్ మీడియా నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నా. పూరి కనెక్ట్స్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పటి వరకు ప్రేమని పంచండి..జీవించనివ్వండి అని ట్వీట్ చేసింది.
ఛార్మి ట్వీట్ పై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ కి దిగారు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే ఆడేసుకుంటుంటారు. జనగణమన చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో తీయండి అంది రిక్వస్ట్ చేస్తున్నారు. దీనిపై స్పందిస్తున్న మహేష్ ఫ్యాన్స్.. మీకేమైనా పిచ్చా.. ఫ్లాప్ సినిమా కావాలని ఆశగా ఉందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మరికొందరైతే ఈసారి అయినా అతి చేయకుండా సినిమా తీయండి అని కామెంట్స్ పెడుతున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి ముందు నుంచి నార్మల్ గానే మాట్లాడుతున్నారు. అతి చేసింది మొత్తం విజయ్ దేవరకొండే అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటే ఇలానే ఉంటుంది అని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా నుంచి బ్రేక్ కాదు. జనగణమన ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇలా మాట్లాడుతోంది అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. విడుదలైనప్పటి నుంచి లైగర్ ఊహించని విధంగా ట్రోలింగ్ కి గురవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచేసి.. నాసిరకంగా కథతో రావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సినిమాలో కనీసం యావరేజ్ కంటెంట్ ఉన్నా మంచి వసూళ్లు వచ్చేవి అని ప్రేక్షకులు అంటున్నారు.