MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2: రిలీజ్ డేట్ మార్పు? రేపే ఎనౌన్సమెంట్

పుష్ప 2: రిలీజ్ డేట్ మార్పు? రేపే ఎనౌన్సమెంట్

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 5 కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో ఒకేసారి విడుదల కానుంది.

2 Min read
Author : Surya Prakash
Published : Oct 23 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది. ఈ సినిమా భారీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.

  ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమా కోసం రాత్రింబవళ్లూ పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ మారిందని సమాచారం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని ఒరిజనల్ ప్లాన్. అయితే ఇప్పుడు ఒక రోజు ముందుకు వచ్చిందని తెలుస్తోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పుష్ప 2 చిత్రం రిలీజ్ డేట్ డిసెంబర్ 5 కు వెళ్తోంది. స్పెషల్ ప్రీమియర్స్ డిసెంబర్ 4 న పడబోతున్నాయి. ఈ మేరకు ఈ మార్పు చెప్పటానికి రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

36
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar


 ఈ సినిమాతో ఎట్టిపరిస్దితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన పరిస్దితి సుకుమార్. అయినా ఆ ఒత్తిడిని తన మీద పడనివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా అన్ని అంశాలు అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ప్రాణంగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్,   VFX క్వాలిటీ మిస్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు  VFX వర్క్ యూరప్ లో జరుగుతోంది.

46
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar

విజువల్ ఎఫెక్ట్స్ పుష్ప2  సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. జపాన్, శ్రీలంక వంటి వైవిధ్యమన లొకేషన్స్ లు, మల్టిఫుల్ జోన్స్, అడవులలో షూట్ చేయటంతో వాటిని ఒకే తాటిపై తెచ్చి...ఒకే చోట చిత్రీకరించినట్లు అనిపించటానికి VFX వాడుతున్నారని తెలుస్తోంది. లైవ్ యాక్షన్ షాట్స్ తో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ రియలిస్టిక్ లుక్ తేవటంలో తమ  పాత్రను సమర్దవంతంగా నిర్వహిస్తాయి. 

56
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar


పుష్ప 2 లో కొన్ని పార్ట్ లు CGI లో క్రియేట్ చేసినప్పటికీ, VFX కే ఎక్కువ ప్రయారిటీ. VFX, CGI కలిసి కొత్త ప్రపంచాన్ని చూసేవారికి అందించబోతున్నాయి. హాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా యూరప్ లో  VFX చేస్తూంటారు. అక్కడ చాలా పెద్ద సినిమాలకు పని చేసిన టీమ్ పుష్ప 2 కు పనిచేస్తోంది. కాబట్టి సుకుమార్ రిలాక్స్ గా,కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  ఇప్పటికే ఫస్టాఫ్ ఓకే చేసి లాక్ చేసేసారు. దాదాపు  600 నుంచి  800 షాట్స్ దాకా రీవర్క్ చేసారు. ఎంత ఖర్చు అయినా పెట్టడానికి నిర్మాతలు ఉత్సాహం చూపించటమే అందుకు కారణం. 

66

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపింది. బన్ని  కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది..ఈ క్రమంలో పుష్ప2 పై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో తెలిసిందే. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved