- Home
- Entertainment
- తారలు దిగొచ్చిన వేళ.. రష్మిక, జాన్వీ, అనన్య , విజయ్ దేవరకొండ, కత్రినా..సెలబ్రిటీ బర్త్ డే పార్టీలో హంగామా
తారలు దిగొచ్చిన వేళ.. రష్మిక, జాన్వీ, అనన్య , విజయ్ దేవరకొండ, కత్రినా..సెలబ్రిటీ బర్త్ డే పార్టీలో హంగామా
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరణ్ జోహార్ బాలీవుడ్ లో అజాతశత్రువు.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరణ్ జోహార్ బాలీవుడ్ లో అజాతశత్రువు. ఆయనకు బాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ చిత్ర పరిశ్రమలలో ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి. బాహుబలి చిత్రాన్ని హిందీలో మార్కెట్ లో విజయవంతంగా రిలీజ్ చేసిన నిర్మాత ఆయన.
ఇదిలా ఉండగా మే 25న కరణ్ జోహార్ తన 50వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ గా జరిగిన కరణ్ జోహార్ బర్త్ డే బాస్ కి బాలీవుడ్ తారలు, సౌత్ హీరోయిన్లు హాజరయ్యారు. కళ్ళు చెదిరే డ్రెస్ లలో హీరోయిన్లు, హీరోలు, దర్శకులు కరణ్ బర్త్ డే బాష్ కి హాజరయ్యారు.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంటగా కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. మెరుపులు మెరిపించే డ్రెస్ ఐశ్వర్య రాయ్ కళ్ళు జిగేల్ మనిపిస్తోంది. అభిషేక్ బచ్చన్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
లైగర్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి ముగ్గురూ కలసి కరణ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. లైగర్ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ ప్రజెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల భామ రాణి ముఖర్జీ కూడా కరణ్ బర్త్ డే బాష్ లో మెరిశారు. సల్మాన్ ఖాన్ సింపుల్ గా స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.
బాలీవుడ్ లో గ్లామర్ తో చక్రం తిప్పుతున్న నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లు అనన్య పాండే, అతిలోకసుందరి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ వారసురాలు సారా అలీ ఖాన్ మతి పోగొట్టే డ్రెస్ లలో అందాలు ఆరబోస్తూ బర్త్ డే బాష్ లో హంగామా చేశారు.
ఇక పాల మేనుతో కుర్రాళ్లకు చెమటలు పట్టించే మిల్కీ బ్యూటీ తమన్నా ధరించిన డ్రెస్ అయితే బర్త్ డే బాష్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పింక్ లెదర్ డ్రెస్ ధరించిన తమన్నా బటన్స్ విప్పి థైస్ అందాలు, క్లీవేజ్ సోకులు ఆరబోస్తూ మతి పోగొడుతోంది.
ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన కళ్ళు చెదిరేలా బ్లాక్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ సెగలు రేపుతోంది. చిరునవ్వులు చిందిస్తూ బర్త్ డే బాష్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఆన్ స్క్రీన్ శ్రీవల్లి.
రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలసి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చింది. రకుల్ కూడా రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ మైమరపించే లుక్ లో మెరిసింది.
ఇక 50 ప్లస్ బ్యూటీ టబు కళ్ళు చెదిరేలా బ్లూ శారీలో కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైంది. బ్లూ శారీలో టబుని ఇలా చూస్తే ఆమె వయసు నిజంగా 51 సంవత్సరాలా అని ఆశ్చర్యం కలుగుతుంది.
అనన్య పాండే ఫోటో షూట్ తరహాలో ఓ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో మెరిసింది. జాన్వీ కపూర్ పింక్ డ్రెస్ లో చలాకీగా ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా కరణ్ జోహార్ బర్త్ డే బాష్ నార్త్ అండ్ సౌత్ సెలెబ్రటీల హంగామాతో మెమొరబుల్ గా ముగిసింది.
ఇదిలా ఉండగా కరణ్ జోహార్ త్వరలో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో పాల్గొనబోతున్నారు. ఈ షోకి ఆయన హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సౌత్ నుంచి చాలా మంది సెలెబ్రటీలు పాల్గొనే అవకాశం ఉంది.