రేణు దేశాయ్ ఇంట్లో పండగ వాతావరణం, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందంటూ కామెంట్స్..ఇంత సంతోషం ఎందుకంటే
తాజాగా రేణు దేశాయ్ మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. గ్రీన్ శారీలో ఆమె ట్రెడిషనల్ గా ముస్తాబై కనిపిస్తున్నారు. ఆమె అంతులేని సంతోషంతో ఉన్నట్లు ఈ దృశ్యాల ద్వారా అర్థం అవుతోంది.
రేణు దేశాయ్ గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె పూణేలో ఉంటున్నారు. పిల్లల భాద్యతలు చూసుకుంటున్నారు. ఇటీవల జనసేన పార్టీ విజయం సాధించడంతో అకిరా, ఆద్య తమ తండ్రితో సందడి చేస్తున్నారు.
Renu desai
అకీరా తన తండ్రితో తో కలసి ప్రధాని నరేంద్ర మోడీని కలసిన ఫోటోలని కూడా రేణు దేశాయ్ షేర్ చేశారు. ఇక తాజాగా రేణు దేశాయ్ మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. గ్రీన్ శారీలో ఆమె ట్రెడిషనల్ గా ముస్తాబై కనిపిస్తున్నారు.
Renu desai
ఆమె అంతులేని సంతోషంతో ఉన్నట్లు ఈ దృశ్యాల ద్వారా అర్థం అవుతోంది. తన సంతోషానికి, ట్రెడిషనల్ లుక్ కి కారణం తెలిపారు. తన ఇంట్లో గణేష్ పూజతో పాటు, హోమం నిర్వహించారట. తానే స్వయంగా ప్రసాదం వండినట్లు రేణు దేశాయ్ తెలిపింది.
తన చేతులతో స్వయంగా ప్రసాదం చేసి పూజ చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని రేణు దేశాయ్ పేర్కొంది. పూజ హోమం చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నట్లు రేణు దేశాయ్ పేర్కొన్నారు.
Renu Desai
అకిరా, ఆద్య ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీని కలవడంతో రేణు దేశాయ్ ఉప్పొంగిపోతున్నారు. తనకి టీనేజ్ అప్పటి నుంచి బిజెపి అంటే ఇష్టం అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. అకిరా పవన్ కళ్యాణ్ తో కలసి ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు. కానీ ఆధ్య వెళ్ళలేదు.
Renu Desai
అదే రోజు ఆధ్యకి స్కూల్ మొదలైందట. తొలిరోజు స్కూల్ మిస్ కాకూడదని ఆద్య వెళ్ళలేదు. ఇక ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆద్యకి మోడీని కలిసే ఛాన్స్ వచ్చింది. దీనితో రేణు దేశాయ్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.