డింపుల్ హయతికి పెళ్లైందా ? ఆమె భర్త అడ్డంగా ఇరుక్కుపోయారు..ఇద్దరిపై కేసు నమోదు
నటి డింపుల్ హయతికి పెళ్లయింది అనే విషయమే అభిమానులకు షాకింగ్.. అలాంటిది డింపుల్ హయతిపై, ఆమె భర్తపై కేసు నమోదు కావడం మరో ఆశ్చర్యకర విషయం. అసలు ఆ కేసు ఏంటి ? ఆమె భర్త ఎవరు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఐటెం సాంగ్ తో క్రేజ్
నటి డింపుల్ హయతి గురించి పరిచయం అవసరం లేదు. గల్ఫ్ అనే చిత్రంతో డింపుల్ హయతి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దేవి 2, అభినేత్రి 2 చిత్రాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. కానీ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంలో సూపర్ హిట్టు అనే ఐటెం సాంగ్ చేసింది. దీనితో ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగింది. గద్దలకొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తర్వాత కూడా డింపుల్ హయతికి అవకాశాలు పెరగలేదు. ఒకటిరెండు క్రేజీ ఆఫర్స్ దక్కాయి.
వరుస డిజాస్టర్లు
కానీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో డింపుల్ హయతికి మరో అవకాశం దక్కలేదు. ముందుగా ఆమెకి రవితేజ ఖిలాడీ చిత్రాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. ఈ మూవీలో గ్లామర్ ఒక రేంజ్ లో ప్రదర్శిస్తూ తన డ్యాన్స్ నైపుణ్యం మొత్తం ప్రదర్శించింది. డింపుల్ హయతి అద్భుతమైన డ్యాన్సర్. ఖిలాడీ చిత్రంలో గ్లామర్ ప్రదర్శించినప్పటికీ ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత డింపుల్ హయతి గోపీచంద్ సరసన రామబాణం చిత్రంలో నటించింది. బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆ మూవీ కూడా నిరాశపరిచింది.
డింపుల్ హయతికి పెళ్లైందా ?
2023లో రామబాణం చిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత డింపుల్ హయతికి మరో మూవీలో ఛాన్స్ రాలేదు. తాజాగా డింపుల్ హయతి వార్తల్లో నిలిచింది. డింపుల్ హయతిపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన ఇంట్లో పనివాళ్లని వేధించిన ఆరోపణలతో పోలీసులు డింపుల్ హయతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆమె భర్తపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీనితో నెటిజన్లు, సినీ అభిమానులు అసలు డింపుల్ హయతికి పెళ్లి ఎప్పుడు అయింది ? ఆమె భర్త ఎవరు ? ఇంతకాలం ఆమె భర్త ఎందుకు సీక్రెట్ గా ఉన్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె పెళ్లి గురించి అభిమానుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడూ డింపుల్ హయతి కూడా తనకి పెళ్ళైన విషయాన్ని ప్రకటించలేదు. తన భర్తని కూడా మీడియా ముందు చూపించలేదు.
పనిమనుషులని దూషించిన డింపుల్ హయతి
ఓ యువతీ ఇద్దరు యువతులని ఒరిస్సా నుంచి తీసుకుని వచ్చి డింపుల్ హయతి ఇంట్లో పనికి పెట్టిందట. నాలుగు రోజుల పాటు వారితో పనిచేయించుకున్న డింపుల్ వారిద్దరినీ ఇష్టం వచ్చినట్లు దూషించి ఇంట్లో నుంచి పంపించి వేసిందట. ఈ క్రమంలో 'మీ బ్రతుకులు నా చెప్పుల విలువ ఉండవు' అంటూ తీవ్రంగా డింపుల్ హయతి వాళ్ళని దూషించినట్లు తెలుస్తోంది. పని చేసినందుకు నాలుగు రోజులకు జీతం కూడా ఇవ్వలేదట. దీనితో ఆ యువతులు పోలీసులని ఆశ్రయించారు.
కేసు నమోదు
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. షేక్ పేటలోని వెస్ట్ వుడ్ అపార్ట్మెంట్ లో డింపుల్ హయతి తన భర్త డేవిడ్ తో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. తమని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడడంతో పాటు చంపేస్తాం అని బెదిరింపులకు కూడా డింపుల్, ఆమె భర్త పాల్పడినట్లు ఆ యువతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనపై డింపుల్ హయతి ఇంకా స్పందించలేదు.