- Home
- Entertainment
- `బ్రహ్మాస్త్ర`ని మించిన శక్తి దేనికుందంటే?.. అసలు కథ బయటపెట్టిన రాజమౌళి.. విజువల్ వండర్ అంటూ
`బ్రహ్మాస్త్ర`ని మించిన శక్తి దేనికుందంటే?.. అసలు కథ బయటపెట్టిన రాజమౌళి.. విజువల్ వండర్ అంటూ
`బ్రహ్మాస్త్ర` సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అసలు కథని రివీల్ చేశాడు రాజమౌళి.

ఇండియన్ మూవీస్‌లో మరో విజువల్ వండర్‌గా, అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. బాలీవుడ్‌లో రూపొందిన బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, డింపుల్‌క పాడియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ షురూ చేసింది యూనిట్.
ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అసలు కథని రివీల్ చేశాడు రాజమౌళి. కథకి మూలం ఎక్కడుంది, ఈ సినిమాని ఏ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారనేది వెల్లడించారు. అసలు కథేంటో వెల్లడించారు. 2016లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ కథని తనకు చెప్పినట్టు తెలిపారు. ఆ టైమ్‌లోనే తాను ఈ బ్రహ్మాస్త్ర కథకి చాలా ఎగ్జైట్ అయినట్టు చెప్పారు. మన పురణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నింటిని కలిపి `ఆస్త్రావర్స్` అనే కథని క్రియేట్ చేశారట.
`అస్త్రావర్స్` గురించి వివరిస్తూ, మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం పంచభూతాలు. అలాంటి పంచ భూతాన్ని శాసించే శక్తి బ్రహ్మా శక్తి. బ్రహ్మాస్త కథ కథ ఆ బ్రహ్మా శక్తి నుంచి పుట్టిన అస్త్రాల గురించి, ఆ అస్త్రాలను ఉపయోగించే సూపర్ హీరోల గురించి చెబుతున్నారు. ఉదాహరణకి వానరాస్త్రకి కింగ్ కాంగ్‌కి ఉన్నంత బలం ఉంటుందని, ఆ అస్త్రాన్ని ధరించిన వాళ్లు కింగ్ కాంగ్ ఎంత దూరం ఎగరగలుగుతుందో అంత దూరం ఎగరగలుగుతారని, అంతటి బలం వానరాస్త్రం సొంతమన్నారు.
రాజమౌళి ఇంకా చెబుతూ, నంది అస్త్ర గురించి వివరించారు. ఒక వెయ్యి ఒంగోలు గిత్తలకు ఉండే శక్తి ఆ అస్త్రాన్ని ధరిస్తే వస్తుందని, ఇలాంటి అస్త్రాలు చాలా ఉన్నాయని తెలిపారు. వాటిని ఉపయోగించే సూపర్ హీరోలు,వాళ్ల మధ్య జరిగే సంఘర్షణ, ఫైట్ ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ అని వెల్లడించారు. అయాన్ ముఖర్జీ దీన్ని ఒక విజువల్ వండర్‌గా క్రియేట్ చేశారని చెప్పారు.
అయితే అస్త్రాలు, బ్రహ్మాస్త్ర కంటే అతి శక్తివంతమైనది మరోటి ఉందని, అదే ప్రేమ అని తెలిపారు. ప్రేమకి అన్నింటిని మించిన శక్తి ఉందన్ని, అది ఎలాంటి బలమైన శక్తులనైనా ఎదుర్కొంటుందని, ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ మిగిలి శక్తులను ఎలా ఎదుర్కొందనేది ఈ సినిమా కథ అని చెప్పారు. అద్భుతమైన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆ అనుభూతిని పొందాలని తెలిపారు రాజమౌళి.
ntr, Brahmastra
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన `బ్రహ్మాస్త్ర`ని హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, తెలుగులో విడుదల చేయబోతున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని డిస్నీ సంస్థ గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా రిలీజ్ చేయబోతుందట. అదే సమయంలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు(సెప్టెంబర్ 2)న నిర్వహిస్తున్నారు. దీనికి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.