బిగ్ బాస్ హౌస్‌లోకి లేడీ విలన్.. రుద్రాణి అత్త అడుగుపెడితే రచ్చ రచ్చే..
Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ సీజన్ 9పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ సమయంలో ఓ టీవీ సీరియల్ ముద్దుగుమ్మ కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందట.

బిగ్ బాస్ ప్రారంభం ఎప్పుడు?
బుల్లితెర ప్రేక్షకల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం ఎంతో మంది ప్రేక్షకులు వేచిస్తున్నారు. మోస్ట్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్‌కి లాంఛింగ్ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ఆరంభం కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సారి షోను కొత్తగా, మరింత ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో పాటు టాస్కులు, గేమ్స్ విషయంలో కూడా కొత్త రూల్స్ అమలు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
కంటెస్టెంట్స్ ఎవరంటే?
ఎప్పటిలాగే ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. గత సీజన్లలోనూ ఆయన హోస్టింగ్‌కు మంచి స్పందన రావడంతో, ఈసారి కూడా అదే క్రేజ్ కొనసాగుతుందని అంచనా. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరెవరు హౌస్‌లోకి వస్తారన్న సస్పెన్స్. కంటెస్టెంట్స్ ఎవరనే బజ్ కూడా భారీగా క్రియేట్ అయ్యింది. ఇక కంటెస్టెంట్స్ లిస్టుపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ సారి బుల్లితెరలో ఫేమస్ అయిన పలు ఆర్టిస్టులు హౌస్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. అంతేకాదు, సినీ నటుల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
కామన్ మ్యాన్ ఎంట్రీలు
ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే.. కామన్ మ్యాన్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటున్నారు. ‘అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేకంగా ప్రోగ్రామ్ నిర్వహించి, సెలక్షన్ ప్రాసెస్ చేశారు. దీనికి బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందుమాధవి, మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండగా, శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ లోకి రుద్రాణి అత్త
ఈసారి కంటెస్టెంట్ లిస్టులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షర్మిత గౌడ. అంటే మనందరికీ ఇష్టమైన బ్రహ్మముడి సీరియల్‌లో "రుద్రాణి అత్త"గా తెలిసిన బ్యూటీ. బ్రహ్మముడి సీరియల్ లో నెగటివ్ రోల్‌లో అదరగొడుతుంది. తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. అంతే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతుందనే టాక్ వినిపిస్తోంది.
మోడలింగ్ నుంచి సీరియల్స్ దాకా
ఇక షర్మిత గౌడ విషయానికి వస్తే.. కర్ణాటకలోని చిక్కమంగళూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. డిగ్రీ పూర్తి చేసిన తరువాత.. మోడలింగ్‌లో కెరియర్ స్టార్ట్ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేసింది. 2017లో మిస్ కర్ణాటక టైటిల్ గెలుచుకుంది. తరువాత సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు అందుకుని బిజీ అయ్యింది. అలా కన్నడలో సువర్ణ, మనేయే మంత్రాలయ, గీత వంటి సీరియల్స్ లో నటించి, మెప్పించింది. బుల్లి తెర ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తరువాత తమిళ్‌లో ‘నీలా’ సీరియల్తో ఎంట్రీ ఇచ్చి, టెలివిజన్ ఆడియెన్స్‌కి మరింత దగ్గరైంది.
షర్మిత గౌడ.. అటు కన్నడ, తమిళ ఇండస్ట్రీని ఏలేసింది. అంతేకాదు.. మోడలింగ్‌లోనూ దున్నేసింది. ప్రస్తుతం తెలుగులో బ్రహ్మముడి సీరియల్‌తో "రుద్రాణి అత్త"గా అదరగొడుతుంది. తన విలనిజంతో చుక్కలు చూపిస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పర్సనల్ లైఫ్
షర్మిత గౌడ తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కేదర్ ప్రసాద్ గౌడ (Kedar Prasad Gowda)ని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా తన కెరీర్‌ని ఆపకుండా కొనసాగిస్తోంది. మోడలింగ్, సీరియల్స్, సోషల్ మీడియాలో క్రేజ్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. సీరియల్ లో పద్దతిగా ఉండే ఈ బ్యూటీ.. బయట మాత్రం యమా హాట్ గా సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి షర్మిత గౌడ ఎంట్రీ ఇస్తుందని టాక్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో కూడా షర్మిత గౌడ ( రుద్రాణి అత్త) ఎంట్రీపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. నిజంగానే రుద్రాణి అత్త హౌస్‌లోకి వస్తే, రచ్చ రచ్చే గ్యారెంటీ అంటున్నారు అభిమానులు.