- Home
- Entertainment
- శ్రీముఖి ఇలా తెగించిందేంటి?.. బ్రహ్మాజీని పట్టుకుని తన భర్త అంటూ ప్రకటన.. ఏంటీ దారుణం..
శ్రీముఖి ఇలా తెగించిందేంటి?.. బ్రహ్మాజీని పట్టుకుని తన భర్త అంటూ ప్రకటన.. ఏంటీ దారుణం..
బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి కూడా రష్మిలాగే ముదురు భామగా నిలుస్తుంది. ఏజ్ మీద పడుతున్నా పెళ్లి ఆలోచన లేదు. కానీ ఆమె ఉన్నట్టుండి పిచ్చెక్కించే ప్రకటన చేసింది.

శ్రీముఖి యాంకర్ చాలా బిజీగా ఉంది. మిగిలిన తెలుగు యాంకర్స్ కంటే తనే ఎక్కువ షోస్ చేస్తుంది. అత్యంత క్రేజ్ ఉన్న యాంకర్‌గా రాణిస్తుంది. తనకంటే సీనియర్లు అయిన సుమ, అనసూయ, రష్మిలను మించిపోయింది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్‌గా, అత్యధిక షోస్ చేస్తున్న యాంకర్‌గా నిలిచింది.
చలాకీతనంతో అల్లరి చేస్తూ యాంకర్ చేస్తూ అలరిస్తుంది శ్రీముఖి. ఈ అమ్మడి షోలో సగం రచ్చే శ్రీముఖిదే ఉంటుంది. అయితే ఇప్పటికీ పెళ్లి ఊసు లేని శ్రీముఖి.. తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. అందరికి షాకిస్తూ ఈయనే మా ఆయన అంటూ ప్రకటించింది. ఇదే ఇప్పుడు నెట్టింట రచ్చ అవుతుంది.
శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న షోస్‌లో `కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్` కూడా ఒకటి. అనిల్ రావిపూడి జడ్జ్ గా ఈ షో రన్ అవుతుంది. సగం జబర్దస్త్ కమెడియన్లు ఇందులో ఉన్నారు. గతంలో కామెడీ స్టార్స్ లో చేసిన ఆర్టిస్టులు ఇందులో చేస్తున్నారు. `ఆహా`లో ప్రసారం అయ్యే షో ఇది. ఓ రకంగా జబర్దస్త్ కి పోటీగా రన్ అవుతుందని చెప్పొచ్చు.
ఈ షోకి ప్రతి వారం ఒకరు గెస్ట్ గా సందడి చేస్తుంటారు. తాజాగా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ ఈ షోలో సందడి చేశారు. ఆయన వచ్చారంటే కామెడీకి కొడవలేదు. ఆయనపై పంచ్‌లు బాగా పేలుతుంటాయి. ఆయన కూడా పంచ్‌లతో అదరగొడుతుంటారు. ఇందులోనూ అదే జరిగింది. రావడం రావడంతోనే అనిల్ రావిపూడి పంచ్‌లతో రెచ్చిపోయాడు. ఆయన వస్తున్నాడంటే తాను బాగా రెడీ అయి వచ్చేవాడిని అని చెప్పాడు.
దీనికి రియాక్ట్ అయిన శ్రీముఖి.. బ్రహ్మాజీ వస్తున్నాడని తెలిసి తన డ్రెస్ కట్ చేసుకుని వచ్చిందట. అది షోలో స్టేజ్‌పై అందరి ముందు చూపించింది. తన థైస్ కనిపించేలా ఆమె డ్రెస్ కట్ చేసుకున్నట్టు తెలిపింది. దీనికి బ్రహ్మాజీకి మైండ్ బ్లాక్ అయ్యింది. అనిల్ రావిపూడి సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశాడు.
అంతటిలో అవలేదు. మరో సంచలన ప్రకటన చేసింది బుల్లితెర రాములమ్మ. భర్తలకు సంబంధించిన ఓ స్కిట్‌ని ప్రదర్శించారు. అందులో ఇద్దరు తమ భర్త గురించి మాట్లాడుకున్నారు. దీంతో మా ఆయన డొల్లా కాదు, ఇంతకి మా ఆయన ఎవరో తెలుసా? అంటూ బ్రహ్మాజీనే మా అయాన అని అందరి ముందు ప్రకటించింది శ్రీముఖి. దీనికి బ్రహ్మాజీ సిగ్గులతో ముగ్గేశాడు. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది.
జనవరి 6న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. జస్ట్ కామెడీ కోసం శ్రీముఖిలా తెగించి కామెంట్ చేయడం షాక్ కి గురి చేస్తుంది. బ్రహ్మాజీ కోసం థైస్ కనిపించేలా డ్రెస్ వేసుకోవడం, అలాగే ఆయనే నా మొగుడు అంటూ ప్రకటించడం ఆశ్చర్యపరుస్తుంది. ఎంత కామెడీ కోసమైనా ఇలా తెగిస్తారా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.