Chiranjeevi: సమంతకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న చిరంజీవి.. మామూలు ట్విస్ట్ కాదుగా ?
రిలీజ్ డేట్స్ విషయంలో సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం యశోద రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Chiranjeevi
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సినిమాల పండుగ జరుగుతోంది. పాండమిక్ తగ్గుముఖం పట్టడంతో భారీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వేట షూరూ చేశాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలయింది. త్వరలో కేజిఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 ఇలా వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయి.
Chiranjeevi
రిలీజ్ డేట్స్ విషయంలో సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం యశోద రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగష్టు 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అదే రోజున అఖిల్ ఏజెంట్ చిత్రం కూడా రిలీజ్ కానుంది.
Chiranjeevi
దీనితో మాజీ వదిన, మరిది మధ్య పోటీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ మరొకటి జరగబోతోంది. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్ని నెలల గ్యాప్ లోనే చిరు మరో చిత్రంతో రాబోతున్నారు.
Chiranjeevi
మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మూవీ 'గాడ్ ఫాదర్' గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే సమంత యశోద చిత్రానికి చిక్కులు తప్పవు.
Chiranjeevi
లూసిఫెర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఆగష్టు 11న రిలీజ్ కు అనువైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది. సమంత ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. అఖిల్ తొలిసారి కంప్లీట్ గా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న చిత్రం ఏజెంట్. అటు గాడ్ ఫాదర్, ఇటు ఏజెంట్ మధ్య యశోద చిత్రం విడుదల కావడం రిస్క్ తో కూడుకున్న పనే.
Chiranjeevi
గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన తర్వాత యశోద చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి తక్కువ గ్యాప్ లో రెండు చిత్రాలు రిలీజ్ కానుండడం ఊహించని పరిణామమే.