త్రిష ఇంట్లో అర్ధరాత్రి అలజడి, రంగంలోకి పోలీసులు! అసలు కారణం ఇదేనా?
హీరోయిన్ త్రిష ఇంట్లో అర్ధరాత్రి అలజడి మొదలయ్యింది. చెన్నైలోని ఆమె ఇంటికి పోలీసులు రావడం, ఇంటిని అనువణువు చెక్ చేయడంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీని తర్వాత డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఇంతకీ విషయం ఏంటి?

బాంబు బెదిరింపులు
తమిళనాడులో కొన్ని చోట్ల బాంబులు పేలుతాయనే వార్తలు భయాన్ని కలిగిస్తాయి. అలాగే పాఠశాలల్లో బాంబులు పెట్టారని హెచ్చరికలు రావడంతో, విద్యార్థులను ఖాళీ చేయించిన ఘటనలు గతంలో జరిగాయి.
త్రిష ఇంటికి బెదిరింపు కాల్
ఇలాగే సీఎం ఇల్లు, గవర్నర్ భవనం, రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపులు వస్తుంటాయి. పోలీసులు తనిఖీ చేశాక అవి వదంతులని తేలిన సంద్భాలు ఉన్నాయి. ఇక తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపే వచ్చింది.
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో
గత 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న సెలబ్రిటీ త్రిష. ఆమె ఇంట్లో బాంబు పెట్టారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో చెన్నైలోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అణువణువు పరీక్షించారు.
సీఎం కు కూడా బెదిరింపులు
ఇలాగే చెన్నైలోని గవర్నర్ భవనం, సీఎం, బీజేపీ ఆఫీసు, నటుడు ఎస్వీ శేఖర్ ఇళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. తనిఖీల్లో అవన్నీ ఫేక్ అని తేలింది. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అన్న విషయంపై విచారణ కొనసాగుతోంది.