డబ్బులు ఎవరిస్తే వారితో పడుకోవాలనేవాడు.. మాజీ భర్తపై కరిష్మాకపూర్ సంచలన ఆరోపణలు
మాజీ భర్తపై ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ భర్త తనను చిత్ర హింసలకు గురిచేశాడని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త తనను పశువులా వేలం వేశాడని ఆమె ఆరోపించారు.

బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీటౌన్ లో వారిదే హవా... హీరోలు, హీరోయిన్లు..మాత్రమే కాదు.. దర్శకులు,నిర్మాతలు.. ఇలా ఈ ఫ్యామిలీ నుండి అనేక మంది స్టార్స్ గా వెలుగు వెలిగారు.
ఇక ఈ కోవలోనే బాలీవుడ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది కరిష్మా కపూర్. తన చెల్లెలు కరీనా కపూర్ కంటే ముందు బాలీవుడ్ లో అడుగు పెట్టి.. వెండితెరను ఓ ఊపు ఊపి వదిలిపెట్టింది కరిష్మా. 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కపూర్ టాప్ స్టార్స్ తో జతకట్టారు.
ఎంత స్టార్ గా ఎదిగిందో.. అంత వివాదాస్పద నటిగాపేరుంది కరీనాకు. ముఖ్యంగా తన భర్తతో గొడవలతో బాగా పాపులర్ అయ్యింది బ్యూటీ. ఇక తాజాగా తన మాజీ భర్తపై మరోసారి ధారుణమైన విషయాలను వెల్లడించింది కరిష్మ. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారితో పడుకోవాలని తన భర్త కోరేవాడని చెప్పుకొచ్చారు.
కానీ ఇలాంటి నీచమైన పనులు నేను చేయలేనని తెగేసి చెప్పానని కరిష్మా వివరించారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన మాజీ భార్యతో ఎఫైర్ కొనసాగించేవాడని కరిష్మా వివరించారు. తన వేధింపులు భరించలేకనే భర్తతో విడాకులు తీసుకున్నానని వెల్లడించారు.
అత్యధిక వసూళ్లు చేసిన రొమాన్స్ రాజా హిందుస్తానీ (1996), దిల్ తో పాగల్ హై (1997)లో నటించిన పాత్రలు కరిష్మాను స్టార్‌గా నిలబెట్టాయి. ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, జాతీయ చలనచిత్ర పురస్కారం, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.