- Home
- Entertainment
- Kangana Faced Insults: ఇండస్ట్రీ నుంచి వెళ్శగొట్టాలని చూశారు... కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.
Kangana Faced Insults: ఇండస్ట్రీ నుంచి వెళ్శగొట్టాలని చూశారు... కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.
బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఆమె ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీనే. ఏమాత్రం మోహ మాటం లేకుండా మాట్లాడుతుంది కంగనా. రీసెంట్ గా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్. సినిమా గురించి అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికి కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా రికార్డుకెక్కింది.
అంశం ఏదైనా సరే తనదైన స్టైల్లో స్పందిస్తుంది కంగనా. తనకు అన్యాయం అనిపిస్తే చాలు నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ఎవరైనా పొరపాటున నోరు జారితే ఇక వాళ్ళ పని అంతే.. మాటలతోనే పైనుంచి కింద వరకూ కడిగిపడేస్తుంది కంగనా.
అవతలి వ్యక్తి ఎలాంటి వారు అయినా.. ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ. అయితే బీటౌన్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ మంచి అనుబంధం ఉంది కంగనాకు. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో లాక్ అప్ కి కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
ఇక రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కంగనా రనౌత్. కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేసింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా తనకు ఇండస్ట్రీలో జరిగిన ఘోర అవమానాల గురించి వివరించింది. తాను ఎన్ని మాటలు పడిందో తెలిపింది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనకు అంతగా పరిచయాలు లేకపోవడంతో అందరూ తనను ఏడిపించేవారంటోంది. తను కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవహేళన చేయడంతో పాటు.. తనకు అస్సలు ఇంగ్లీష్ మాట్లాడటం రాదంటూ అవమానించేవారంటోంది. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని ముఖంపైనే చెప్పి వెళ్ళగొట్టాలని చూశానంటోంది కంగనా.
అంతే కాదు అందరూ తనను తిడుతున్నా తనని అర్ధం చేసుకుంది మాత్రం నిర్మాత ఏక్తా కపూర్ అంటోంది కంగనా. అందరిలా ఏక్తా కపూర్ అలా అన్లేదు. కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసి పనిచేశానంటోంది. ఆమె చాలా మంచి వ్యక్తి అంటున్న కంగనా తనకు ఫస్ట్ హిట్ను ఇచ్చింది కూడా ఏక్తా కపూరే అంటుంది. ఇండస్ట్రీ కంగనాను ఒంటరిని చేసినా.. ఏక్తా కపూర్ మాత్రం ఎప్పుడూ.. తనకు మద్దతు ఇస్తూనే ఉంటుంది అన్నారు కంగనా.