Bobby Deol : సౌత్ ఇండస్ట్రీని భయపెడుతున్న బాబీ డియోల్.. ఆ సినిమాల కోసం అంతా వెయిటింగ్!
సౌత్ ఫిల్మ్స్ లో బాలీవుడ్ స్టార్ విలన్ గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ చిత్రాల్లో ఆయనే ప్రతినాయుడిగా నటిస్తున్నారు. దీంతో ఆయన పేరు హాట్ టాపిక్ గ్గా మారింది.
సౌత్ ఫిల్మ్స్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా మన చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. దీంతో బాలీవుడ్ స్టార్ కూడా మన సినిమాల్లో కీలక పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ Bobby Deol పేరు హాట్ టాపిక్ గ్గా మారింది.
బాబీ డియోల్... బాలీవుడ్ చిత్రాలతో హీరోగా, సపోర్టింగ్ రోల్స్ తోనూ అలరించారు. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా రన్బీకపూర్ - సందీప్ రెడ్డి వంగ కాంబోలోని ‘యానిమల్ ది ఫిల్మ్’ Animal The Film చిత్రంతో బాబీ డియో కంబ్యాక్ ఇచ్చారు. ఆయన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
ఇక బాబీ డియోల్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుండటంతో... సౌత్ చిత్రాల్లో ఆయనకు భారీ డిమాండ్ పెరిగింది. మన హీరోలకు విలన్ పాత్రలు పోషించడం కోసం దర్శక నిర్మాతలు ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు.
సౌత్ లో బాబీ డియోల్ లైనప్ విషయానికొస్తే.. తెలుగులో నందమూరి బాలయ్య నెక్ట్స్ మూవీ NBK109లో ఈయనే విలన్ గా నటిస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పిరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ HariHara Veeera Malluలోనూ నటిస్తున్నారు.
ఇక తమిళంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కంగువా’ Kanguva లోనూ బాబీ డియోల్ విలన్ గా అలరించబోతుండటం ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. ఇలా వరుస చిత్రాలతో బాబీ డియోల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారారు.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో బాబీ డియోల్ కూడా చేరి... సౌత్ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. త్వరలో రాబోతున్న చిత్రాలతో బాబీ డియోల్ సౌత్ ఇండియాలో పవర్ ఫుల్ విలన్ గా ముద్ర వేసుకోబోతున్నారు.