‘ఆస్కార్’ బరిలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ చిత్రం .. ఇంతకీ ఏ సినిమా అంటే?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) విభిన్న పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే తను నటించిన చిత్రం తాజాగా ‘ఆస్కార్ అవార్డ్స్ 2022’ బరిలో ఉన్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ అలియా భట్ చివరిగా హిందీలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ (Gangubai Kathiavadi). అలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ముంబైలోని కతియా వాడిలో గంగూబాయి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై.. అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందింది. మూవీలో అలియా భట్ నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
‘గంగూబాయి కతియావాడి’ నిజ జీవితం చిత్రం కావడంతో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అటు అలియా భట్ కూడా ఆ పాత్రను రక్తి కట్టించడంతో మంచి సక్సెస్ ను అందుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల జాబితాల్లో ఈ మూవీ కూడా చేరింది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉందని తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్స్ ల్లో ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
విదేశాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రాన్ని రిలీజ్ కు ముందు కూడా అదిరిపోయేలా ప్రమోట్ చేశారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్స్ లో ‘గంగుబాయి కతియావాడి’ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ రీచ్ దక్కించుకుంది. ఈ సందర్భంగా కచ్చితంగా మూవీకి ఆస్కార్ వరించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉండనుండగా.. ఇటు టాలీవుడ్ నుంచి నటనకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పేరు కూడా ‘ఆస్కార్’ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కొమురం భీం పాత్రలో తారక్ నటనకు ఆస్కార్ వరిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలోనూ అలియా నటించింది. కాగా ప్రస్తుతం ‘బ్రహ్మస్త్ర’ చిత్రం రిలీజ్ పనుల్లో ఉంది.