తలలో మల్లెపూలు.. చీరకట్టు అందాలు.. కవ్వించేలా ప్రభాస్ బ్యూటీ జాక్వెలిన్ పోజులు..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చీరకట్టు అందాలతో మతిపోగొడుతోంది. ఎప్పుడూ లేనిది కొత్తగా తలలో మల్లెపూలు పెట్టుకొని సిగ్గుపడుతూ ఫొటోలకు ఫోజులివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది. జాక్వెలిన్ అటు హిందీ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూనే.. ఇటు గ్లామర్ ఒళకబోస్తూ స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సాహో’లో స్పెషల్ సాంగ్ లో గ్లామర్ స్పెప్పులేసింది. ‘బాడ్ బాయ్’ అంటూ కుర్రాళ్లతో చిందులేయించింది. ఒక్క సాంగ్ తోనే సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించింది.
తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘విక్రాంత్ రోణ’లోనూ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిందీ బ్యూటీ. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘రా రా రక్కమ్మ’ అనే టైటిల్ తో ఐటెం సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఈ సాంగ్ తో కన్నడ ఆడియెన్స్ కు పరిచయం అయిన బ్యూటీ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. అందాలు ఆరబోసి కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అయితే, ఈ చిత్రం కూడా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
దీంతో చిత్ర యూనిట్ తో పాటు జాక్వెలిన్ కూడా తన సాంగ్ ను ప్రమోట్ చేసుకుంటోంది. ఈ మేరకు లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంటూ ‘రా రా రక్కమ్మ’ సాంగ్ లింక్ ను కూడా జతచేసింది. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ లో జాక్వెలిన్ చీరకట్టు అందాలతో మైమరిపిస్తోంది. తొలిసారిగా తన ఆకర్షణీయమైన కురులలో మల్లెపూలు పెట్టుకొని అట్రాక్ట్ చేస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. ఆమె చిరునవ్వుకు గుండె జారి గల్లంతు అవుతోంది. ప్రస్తుతం జాక్వెలిన్.. ‘సర్కస్, రామ్ సేతు’ చిత్రాల్లో నటిస్తోంది.