Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • అబ్బాయిలకు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు, సంచలన నిజాలు వెల్లడించిన బాలీవుడ్ యంగ్ స్టార్

అబ్బాయిలకు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు, సంచలన నిజాలు వెల్లడించిన బాలీవుడ్ యంగ్ స్టార్

గత నలుగైదు ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో నానుతున్న సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకూ అమ్మాయిలే ఈ భూతానికి బలైపోయారు. కాని ఇప్పుడిప్పుడే సంచల నిజాలు బయటకు వస్తున్నాయి. అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ బాదలు తప్పలేదని తెలుస్తోంది. రీసెంట్ స్టార్స్.. ఈ విషయంలో ఓపెన్ అవుతున్నారు. 

Mahesh Jujjuri | Published : Feb 01 2023, 09:51 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సమస్యల్లో  కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. అయితే ఇండస్ట్ట్రీలో.. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ చాలా మంది స్టార్లు కాస్టింగ్ కౌచ్ కు బలైపోయినవారే.. ఈ మధ్య కాలంలో  చాలా మంది హీరోయిన్లు.. కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన చేదు అనుభవాలని పంచుకున్నారు. నటులపై, నిర్మాతలపై, దర్శకులపై చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

26
Asianet Image

అయితే ఇండస్ట్రీలో అమ్మాయిలకే అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురవుతాయట. ఈ విషయంలో ఈ మధ్య నుంచి సంచలన నిజాలు బయటకు తెలుస్తున్నాయి. రీసెంట్ గా స్టార్ సీనియర్ యాక్టర్ అబ్రీష్ పూరి మనవడు.. యాక్టర్ వర్ధన్ పూరి తనకు జరిగిన అనుభవాన్ని వివరించగా.. ఇప్పుడు మరో యాక్టర్ కూడా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించాడు. 

36
Asianet Image

అయితే ఇప్పుడు ఆ లిస్టులోకే మ‌రో బాలీవుడ్ న‌టుడు కూడా వ‌చ్చి చేరాడు. బుల్లితెరపై స్టార్ గా ఉన్న అంకిత్ తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వివరించాడు. హిందీలో బిగ్ బాస్ సీజన్ 16 లో అంకిత్ పాల్గొన్నాడు. రీసెంట్ గా  ఈ షో నుంచి ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు.  సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ అయిన అంకిత్‌ బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యాడు. ఈక్రమంలో ఆయన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న‌కు కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎందురైంద‌ని చెప్పాడు.

46
Asianet Image

సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న టైమ్ లో ఒక వ్య‌క్తి తనకు పరిచయం అయ్యాడని. ఇండస్ట్రీలో పలుకుబడి ఉండటంతో.. అతన్ని సంప్రదించగా.. త‌న‌ను కాంప్ర‌మైజ్ అవుతావా  అని అడిగాడని తెలిపారు. అంతే కాదు  ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు అంతా..  ఉన్న వాళ్లంతా ఇలా చేసి త‌ర్వాత స్టార్లు అయ్యార‌ని కూడా త‌న‌తో చెప్పాడ‌ని అంకిత్ తెలిపాడు. 
 

56
Asianet Image

ఇక ఎలాగైనా తనతో గడపాలని.. అతను ఫిక్స్ అయ్యాడు. అందుకే పెద్ద పెద్ద సెల‌బ్రిటీల పేర్లు చెప్పి త‌న‌ను హీరోగా తప్పకుండా పరిచయం చేస్తాని అయితే కాస్త త్యాగం చేయక తప్పదంటూ .. స్టార్టు అంతా త్యాగాలు చేస్తేనే ఈ స్థాయికి వ‌చ్చార‌ని కూడా ఆ వ్య‌క్తి త‌న‌పై ఒత్తిడి చేసిన‌ట్టు చెప్పాడు.
 

66
Asianet Image

అదంతా త‌న వ‌ల్ల కాద‌ని చెప్పినా కూడా అత‌డు వినిపించుకోలేద‌ని.. అత‌డే త‌న‌ను అస‌భ్యంగా తాకేందుకు ట్రై చేశాడ‌ని… వెంట‌నే తాను అక్క‌డ నుంచి వెల్లిపోయాన‌ని.. ఇదే త‌న జీవితంలో అత్యంత చెత్త సంఘ‌ట‌న అని అంకిత్ చెప్పాడు. దాంతో బాలీవుడ్ లో ఈ ఇష్య్యూ ప్రకంపణలు సృష్టిస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా మెయిల్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బాలీవుడ్
 
Recommended Stories
Top Stories