MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Shruti Haasan: బర్త్ డే గర్ల్ విరహవేదన చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్

Shruti Haasan: బర్త్ డే గర్ల్ విరహవేదన చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 28 2022, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

38

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి.

48

ఓ ఫారెన్ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడింది శృతి హాసన్. అతడిని తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. వీరిద్దరి పెళ్లి దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడితో విడిపోయింది. ఈ నేపథ్యంలో కాటమరాయుడు చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది. 

58

తిరిగి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్, క్రాక్ లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఇక శృతి హాసన్ మ్యూజిక్ ప్రియురాలు. ఆమెకు సంగీతం, సింగింగ్ లో కూడా గ్రిప్ ఉంది.

68

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

78

తాజాగా శృతి హాసన్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతూ చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. శృతి హాసన్ విరహవేదనతో ఉన్నట్లు ఇచ్చిన ఆ ఫోజులు నెటిజన్లని మెప్పిస్తున్నాయి. శృతి హాసన్ ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవుతూ స్టైల్ గా కనిపిస్తుంది. హెయిర్ స్టయిల్, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి అంశం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది శృతి. 

88

కొంతకాలం సింగిల్ గా ఉన్న శృతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికా అనే ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. తరచుగా ఈ శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేడు శృతి హాసన్ 36వ జన్మదిన వేడుక జరుపుకుంటోంది. దీనితో ఆమెకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ravi Teja: క్షణంలో లేడీ కమెడియన్ ప్రాణాలు కాపాడిన రవితేజ, జేడీ చక్రవర్తి అంటే క్రష్ ఉన్న నటి ఎవరో తెలుసా?
Recommended image2
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image3
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved