- Home
- Entertainment
- ప్రభాస్ స్టామినాని వాడుకోవడం చేతకావడం లేదా.. యంగ్ రెబల్ స్టార్ పై 1000 కోట్ల భారం..
ప్రభాస్ స్టామినాని వాడుకోవడం చేతకావడం లేదా.. యంగ్ రెబల్ స్టార్ పై 1000 కోట్ల భారం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎంతటి భారీ చిత్రాలు చేస్తున్నాడో అందరికి తెలిసిందే. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎంతటి భారీ చిత్రాలు చేస్తున్నాడో అందరికి తెలిసిందే. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా స్వరూపమే మారిపోవడంలో ప్రభాస్ క్రెడిట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఆడియన్స్ బాలీవుడ్ స్టార్స్ కన్నా ఎక్కువగా ప్రభాస్ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతలా ప్రభాస్ క్రేజ్ వ్యాపించింది.
నేడు ప్రభాస్ 43వ పుట్టినరోజు. దీనితో సోషల్ మీడియాలో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం మరే స్టార్ హీరోపై లేనెంత ఒత్తిడి ప్రభాస్ పై ఉందని చెప్పొచ్చు. దాదాపు 1000 కోట్లకి పైగా ప్రభాస్ భారం మోస్తున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుండడంతో బడ్జెట్ లెక్కలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ స్టామినాని వాడుకునే దర్శకుడు కనిపించడం లేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బోల్తా కొట్టాయి. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ఆదిపురుష్ చిత్రంపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తో అంచనాలన్నీ తారుమారు చేశాడు ఓం రౌత్. చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ తో బడ్జెట్ గేమ్స్ ఆడుతున్నారు తప్పితే.. నిఖార్సైన సినిమా తీయడం ఎవరి వల్లా కావడం లేదు.
ఆదిపురుష్ చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఇంత బడ్జెట్ లో రూపొందిస్తూ కూడా ఒక యానిమేషన్ టీజర్ వదిలి విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రాజెక్ట్ కె చిత్రం 500 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. అవుట్ పుట్ ఎలా వస్తోందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇంత భారీ చిత్రాలు తెరకెక్కించడంలో నాగ అశ్విన్ కి కూడా అనుభవం లేదు.
ఇక ప్రభాస్ అభిమానులు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్న చిత్రం సలార్. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ కన్నడ దర్శకుడు కెజిఎఫ్ తో ఎలాంటి ప్రభంజనం సృష్టించారో తెలిసిందే. ఈ చిత్రం కూడా 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది.
అలాగే మారుతి దర్శకత్వంలో మీడియం బడ్జెట్ చిత్రానికి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓవరాల్ గా ప్రభాస్ పై 1000 కోట్ల బడ్జెట్ సవారీ సాగుతోంది. మరి బాహుబలి తర్వాత అంతటి విజయం ప్రభాస్ కి ఎప్పుడు దక్కుతుందో చూడాలి.