తల్లి కాబోతున్న బింధు మాధవి..? ఫ్యాన్స్ ఏదో అనుకుంటే.. ఏదో అయ్యిందేమిటి..?
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విన్నర్ గా చరిత్ర సృష్టించింది బింధు మాధవి. హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకోలేకపోయినా.. బిగ్ బాస్ లో మాత్రం తన సత్తా చాటుకుంది. ఇక ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చింది.

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించిన బింధు మాధవి.. టాలీవుడ్ లో మాత్రం పెద్దగా పాపులర్ కాలేకపోయింది. అడపా దడపా సినిమాలు చేసి.. మన హీరోయిన్ అనిపించుకుంది అంతే.. ఇక ఆ పాపులారిటీతోనే తెలుగులో బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయింది. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ట్రోఫీని అందుకుంది బింధు మాధవి.
గతంలో తమిళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన బింధు.. అక్కడ ఫైనల్స్ కు కూడా చేరుకోలకపోయింది. కాని తెలుగు బిగ్ బాస్ లో మాత్రం అభిమానుల ప్రేమను సాధించగలిగింది. ట్రోఫీ అందుకుంది. అంతే కాదు బిగ్ బాస్ హిస్టరీలోనే ట్రోఫీ అందుకున్న ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ గా పేరు సాధిచింది బింధు మాధవి.
ఇక బిగ్ బాస్ తర్వాత బింధు మాధవికి సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి అని అనుకున్నారు ఫ్యాన్స్. హౌస్ లో ఉండగానే అనిల్ రావిపూడి- బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో బింధుకి ఇంపార్టెంట్ రోల్ దక్కుతుంది అనుకున్నారు. కాని ప్రతీ సారి మాదిరిగానే ఈసారి కూడా జరిగింది. బిగ్ బాస్ నుంచి వెళ్ళిన వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఉండటంలేదు. బింధు మాధవికి కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.
Bindu Madhavi
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిందు మాధవి ఒక్కటంటే ఒక్కటి సినిమాకి కూడా సైన్ చేయలెదౌ. ఇక పై చేస్తుందన్న నమ్మకాలు జనాల్లో లేవు. అయితే రీసెంట్గా కోలీవుడ్లో అమ్మడుకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
స్టార్ డైరెక్టర్ బింధు మాధవితో లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో బిందు మాధవి టైటిల్ రోల్ చేయబోతోంది అంటున్నారు. అంతే కాదు హీరోయిన్ గా నటిస్తుంది అనుకుంటే.. బింధు మాధవి ఓ బిడ్డకు తల్లి పాత్రలో చేయబోతున్నట్టు సమాచారం.
బిడ్డ కోసం పడే తాపత్రేయ పడే తల్లి పాత్రలో ఆమో నటించనుందట. ఒకానొక క్షణంలో తల్లి బిడ్డని చేజార్చుకుంటే ఎలా ఉంటుందు.. వారిపై ఆమె న్యాయపోరాటం ఎలా చేసింది అన్న కాన్సెప్ట్ లో సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో బిందు మాధవి 12 ఏళ్ల పాపకు తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
<p>Bindu madhavi</p>
నిజానికి సూపర్ హాట్ గా ఉండే బిందు మాధవి ఫిగర్ కి ఇలాంటి రోల్ సూట్ అవ్వదు అనేది జనాల అభిప్రాయం. అయినా కానీ అమ్మడు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే దానిలో ఏదో పెద్ద కారణమే ఉంది అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమాతో బింధు మాధవి లైఫ్ టర్న్ అవుతుందా..? ఆమె ఇండస్ట్రీలో మరో నయనతార కాబోతోందా..? చూడాలి మరి.