Bindu Madhavi: తనకన్నా వయసులో చిన్నవాడైన తమిళ హీరోతో తెలుగు బ్యూటీ ఎఫైర్ ?
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. హీరోయిన్ల గురించి, హీరోల గురించి తరచుగా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజమైతే మరికొన్ని రూమర్స్ గానే మిగిలిపోతాయి.

Bindu Madhavi
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. హీరోయిన్ల గురించి, హీరోల గురించి తరచుగా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజమైతే మరికొన్ని రూమర్స్ గానే మిగిలిపోతాయి. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ లవ్ అఫైర్ గురించి రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Bindu Madhavi
ఆమె మరెవరో కాదు.. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో దూసుకుపోతున్న అందాల భామ బిందు మాధవి. బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.
Bindu Madhavi
తెలుగులో కంటే బిందు మాధవి తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో కంటెస్టెంట్ గా దూసుకుపోతోంది. బిందుమాధవి ఓ తమిళ హీరోతో ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. హరీష్ కళ్యాణ్ అనే యువ నటుడితో బిందు మాధవి ఎఫైర్ సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Bindu Madhavi
హరీష్ కళ్యాణ్ వయసులో బిందు మాధవి కంటే నాలుగేళ్లు చిన్నవాడు. దీనితో వీరిద్దరి ఎఫైర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరోసారి బిందు మాధవి, హరీష్ కళ్యాణ్ వార్తల్లో నిలిచారు. బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కీలక కంటెస్టెంట్ గా దూసుకుపోతుండడంతో హరీష్ కళ్యాణ్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు.
Bindu Madhavi
'మై డియర్ ఫ్రెండ్ బిందు మాధవి.. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో నీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ షోలో అందరి హృదయాలు దోచేస్తున్నావు అంటూ హరీష్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. దీనితో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నిజమే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Bindu Madhavi
హరీష్ కళ్యాణ్ తమిళంలో హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో కూడా హరీష్ కళ్యాణ్ జై శ్రీరామ్ అనే చిత్రంలో నటించాడు. అలాగే నాని జెర్సీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు.