MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • #Pushpa2: బీహార్ లో ప్రమోషన్స్ మొదలెడుతున్న అల్లు అర్జున్ , కారణం ఏంటంటే

#Pushpa2: బీహార్ లో ప్రమోషన్స్ మొదలెడుతున్న అల్లు అర్జున్ , కారణం ఏంటంటే

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ చిత్రం భారతదేశంలో 6000 స్క్రీన్లలో, విదేశాల్లో 5500 స్క్రీన్లలో విడుదల కానుంది. బీహార్‌తో సహా నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ జరగనున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Nov 04 2024, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప 2 కబుర్లే. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్యాన్  ఇండియా సినిమాలకే షాక్ ఇచ్చేలా  మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ఈ సినిమా ఒకే రోజు 6 భాషల్లో విడుదల కానుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అలాగే పుష్ప 2 చిత్రం మొత్తం 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు. పుష్ప2 సినిమా భారతదేశంలో 6000 స్క్రీన్లలో విడుదల కానుంది. అంతే కాకుండా విదేశాల్లో కూడా 5500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ సైతం భారీగా ప్లాన్ చేసారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప 2 సినిమా క్రేజ్ పెరిగిపోవటమే అందుకు కారణం. ఇక ఈ చిత్రం  ప్రమోషన్స్ ని బీహార్ నుంచి మొదలుపెట్టటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. 

36
allu arjun movie Pushpa2 The Rule release on december 5th

allu arjun movie Pushpa2 The Rule release on december 5th


నార్త్ ఇండియా మార్కెట్ ని దున్నేయటానికి దర్శకుడు సుకుమార్ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్   ప్రమోషన్ ఈవెంట్ ని బీహార్ లోని పాట్నాలో  ప్లాన్ చేస్తున్నారు.

చాలా గ్రాండ్ గా అక్కడ ఈ సినిమా  ప్రమోషన్స్ జరగనున్నాయి. బీహార్ లో పుష్ప సినిమా బాగా ఆడటమే అందుకు కారణం. అలాగే నార్త్ లోని మరికొన్ని కీ సెంటర్స్ ని ఎక్సప్లోర్ చేసి కొత్తగా ఈవెంట్స్ చేయబోతున్నారు. ముంబై, డిల్లీ వంటి నగరాలని ప్రక్కన పెట్టబోతున్నారు.

46
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


బీహార్ పై టీమ్  ప్రత్యేకమైన దృష్టి పెడుతోంది. . తాజాగా బీహార్ లో ఓ అభిమాని పుష్ప రాజ్ సైతిక శిల్పాన్ని చేశారు. గతంలో చాలామంది ప్రముఖుల సైతిక శిల్పాలను ఏర్పాటు చేశారు. తాజాగా బీహార్ లో ఓ అభిమాని ఇలా అల్లు అర్జున్ సైతిక శిల్పాన్ని చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీని పై అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోను బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటివి జరగటం కూడా అక్కడ ప్రమోషన్స్ జరగాలి అని టీమ్ అనుకోవటానికి ఓ కారణం. 

56
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar


బీహార్ తో  పాటు యుపి, గుజరాత్, పంజాప్, రాజస్దాన్ వంటి చోట్ల ఈ సినిమాకు  ప్రమోషన్ ఈవెంట్ ని మాస్ జాతరలా జరపనున్నారు. ప్రస్తుతం ఏయే సిటీల్లో ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనే విధంగా ప్రమోషన్ టూర్ ప్లాన్ చేయబోతున్నారు. వెస్ట్ బెంగాళ్ లో కూడా భారీగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఆ సిటీలను సైతం టచ్ చేస్తుంది యూనిట్.  చిన్న చిన్న టౌన్ లలో కూడా భారీ ఓపినింగ్స్ వచ్చేలా ఈ సినిమాకు ప్లాన్ చేస్తోంది నిర్మాణ సంస్ద.
 

66
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar


తెలుగు నుంచి వస్తున్న పెద్ద సినిమాల్లో నార్త్ లో మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టు పుష్ప 2. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు డీల్స్ క్లోజ్ చేయటంలో బిజిగా ఉన్నారు.  పుష్ప ది రైజ్ మొదటి పార్ట్ నార్త్ లో 150 దాకా వసూలు చేసింది. దాంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఎగ్జిబిటర్స్ నుంచి ప్రెజర్ ఉంది. దాంతో హిందీ డబ్బింగ్ రైట్స్ 220 కోట్లకు క్లోజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు నార్త్ లో సెన్సేషనల్ ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. డిసెంబర్ మొత్తం పుష్ప నెలగా మారిపోతుందని అక్కడ మీడియా అంటోంది. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved