అవినాష్‌ని అన్న అని పిలిచిన మోనాల్‌..ఉయ్యాలపై సోహైల్‌, అఖిల్‌ మధ్య బిగ్‌వార్‌

First Published Dec 3, 2020, 10:16 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టాస్క్ అఖిల్‌ సోహైల్‌ ల మధ్య సాగింది. ఇక అఖిల్‌ టాస్క్ లో ఉండగా, మోనాల్‌ని పడేయాలనుకున్న అవినాష్‌కి చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు ఉయ్యాలపై ఫ్రెండ్స్ సోహైల్‌, అఖిల్‌ మధ్య బిగ్‌ వార్‌ జరిగింది. ఇంకా 88వ రోజు ఏం జరిగిందంటే?

గురువారం ఎపిసోడ్‌లో మొదట గ్రాండ్‌ ఫినాలేకి సంబంధించిన టాస్క్ కొనసాగింది. ముందుగా ఈ కప్‌ కోసం సోహైల్‌, అఖిల్‌ ఫైనల్‌గా పోటీలో ఉన్నారు. ఫినాలే కప్‌ని సోహైల్‌,   అఖిల్‌ హగ్‌ చేసుకున్నారు.

అనంతరం గ్రాండ్‌ ఫినాలే టాస్క్ అనౌన్స్ మెంట్‌ జరిగింది. ఉయ్యాలపై సోహైల్‌, అఖిల్‌ కూర్చోవాల్సి ఉంటుంది. బిగ్‌బాస్‌ చెప్పేంత వరకు ఎవరూ దాన్ని దిగకూడదు. దిగితే   వాళ్ళు టాస్క్ నుంచి నిష్క్రమించినట్టే లెక్క.

ఉయ్యాలపై సోహైల్‌, అఖిల్‌ టాస్క్ ప్రారంభించారు. వీరు టాస్క్ సరిగా చేస్తున్నారా? లేదా అనేది చూసే బాధ్యత అభిజిత్‌కి అప్పగించారు బిగ్‌బాస్‌.

టాస్క్ జరుగుతున్న సమయంలో అవినాష్‌, అరియానా, మోనాల్‌ మధ్య సరదా సన్నివేశాలు జరిగాయి.

అరియానా.. అవినాష్‌కి కాఫీ పెట్టి ఇచ్చింది. మరోవైపు అవినాష్‌ కోసం మోనాల్‌ స్నాక్స్ చేసి ఇస్తానని చెప్పింది. అరియానా బయటకు పిలుస్తుంటే, మోనాల్‌ తన వైపు   పిలిచింది. దీంతో ఇది కాసేపు కామెడీ పంచింది.

అనంతరం మోనాల్‌తో కలిసి కాసేపు తిరిగాడు అవినాష్‌. అఖిల్‌ వద్దకు వచ్చిన మోనాల్‌, తాను లవర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు అవినాష్‌. కానీ మోనాల్‌.. అవినాష్‌ని అన్న   అని పిలిచింది. ఒక్కసారి పరువుపోగా, మరోసారి మోనాల్‌ని తీసుకొచ్చి తనని అవినాష్‌ అని పిలవమనగా, మోనాల్‌.. అవినాష్‌ అన్న అనింది. పిలిపించి మరీ పరువు   తీసుకోవడమంటే ఇదే అని అవినాష్‌ తనని తాను తిట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్‌ నవ్వులు పూయించింది.

ఆ తర్వాత సోహైల్‌, అఖిల్‌కు జ్యూస్‌ పంపించాడు బిగ్‌బాస్‌. ఒకరికొకరు జ్యూస్‌ తాగిస్తూ, ఎందుకు టాస్క్ కొనసాగాలో కారణాలు చెప్పాలనే కండీషన్స్ పెట్టాడు బిగ్‌బాస్‌. దీంతో   ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

ఈ వాగ్వాదంలో అరియానా, అభిజిత్‌ కల్పించుకున్నారు. దీంతో అఖిల్‌, సోహైల్‌ స్పందించి మేమేదో వాదించుకుంటున్నాం. మధ్యలో మీరు ఇన్‌వాల్వ్ కావద్దని చెప్పారు.

ఇలానే రాత్రి మొత్తం ఉంటే చచ్చిపోతామని సోహైల్‌ వాపోయాడు. టాస్క్ అన్నప్పుడు ఉండాల్సిందే అని అవినాష్‌ సెటైర్లు వేశాడు.

మధ్యలో తుపాకీ కాల్పులకు సంబంధించిన సౌండ్‌లు చేసి సభ్యులను భయాందోళనలకు గురి చేశారు. అభిజిత్‌, హారికల మధ్య గత టాస్క్ లకు సంబంధించి చర్చ జరుగుతుండగా, అభిజిత్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడారు. దీనికి హారికి స్పందిస్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడవద్దని చెప్పింది. అందుకు అభిజిత్‌ సీరియస్‌ అయ్యాడు. ఏదైనా ఉంటే బిగ్‌బాస్‌ చెబుతాడు.. నువ్వు చెప్పొద్దని సీరియస్‌ అయ్యాడు.

రాత్రి అనే తేడా లేకుండా లైట్లు అలానే ఉంచాలని బిగ్‌బాస్‌ చెప్పారు. దీంతో టాస్క్ లో ఉన్న సోహైల్‌, అఖిల్‌లతోపాటు అభిజిత్‌, హారిక, మోనాల్‌, అవినాష్‌, అరియానా కూడా   జాగారం చేయాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా అరియానా, అవినాష్‌, హారికల మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అవినాష్‌ని పులిహోరా బ్యాచ్‌గా కామెంట్   చేశారు. అవినాష్‌ కూడా పులిహోరే.. పులిహోరే అంటూ చెప్పడం, ఆ తర్వాత అరియానా వచ్చి అవినాష్‌ని కొట్టడం నవ్వించాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?