సుదీప్ ఇష్టమన్న మోనాల్.. అలాంటి రాత్రి నాకు వద్దు అన్న అరియానా.. అఖిల్‌ని ఆడుకున్న సుదీప్
First Published Nov 29, 2020, 10:29 PM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 12వ వారం ఆద్యంతం కామెడీగా సాగింది. కన్నడ స్టార్ సుదీప్ ఎంట్రీ మరింత అలరించింది. జలజ ఎపిసోడ్ మరోసారి ఇంటిసభ్యులను వణికించగా, చివర్లో ఎలిమినేషన్ ఉత్కంఠతకు గురి చేసింది. మరి ఇంకా ఆదివారం ఏమేమి జరిగాయనేది చూస్దే..

మొదట నాగ్ ఎంట్రీ ఇవ్వడంతోనే అలరించారు. అయితే ఇంటి సభ్యులు నాగార్జున కోసం స్పెషల్‌గా డాన్స్ చేసి చూపించారు. ఇందులో అభిజిత్ కూడా డాన్స్ చేయడం విశేషం. ఈ విషయాన్ని నాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

అనంతరం సభ్యులకు దెయ్యం జలజ ఉన్న రూమ్‌లోకి పంపించాడు. అయితే ఈ సారి ఒక్కొక్కరిని పంపించాడు. అందులో మూడు ఐటెమ్స్ ఉంటాయని, వాటిని గుర్తు పట్టి చెప్పాలన్నారు. హారిక, మోనాల్ దైర్యంగా లోపలికి వెళ్ళి చెప్పారు. మొదట వెళ్ళిన అరియానా భయపడి వెనక్కి వచ్చేసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?