విష్ణుప్రియకు మరోసారి అన్యాయం, ఫ్రెండ్స్ గా మారిన నిఖిల్ - గౌతమ్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజుకో చిత్రం చూడాల్సి వస్తుంది అని మనం ముందు నుంచే అనుకుంటూ ఉన్నాం. ఈక్రమంలోనే తాజాఎపిసోడ్ లో కూడా చాలా చిత్రాలు కనిపించాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో చివరిదశలో ఉన్నాం. ఎవరికి వారు అద్భుతంగా ఆడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టైటిల్ టార్గెట్ గా దూసుకుపోతున్నారు. ఇప్పడు హౌస్ లో ఉన్న ఏడుగురు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పాలి. బిగ్ బాస్ వడపోతల తరువాత మిగిలిని ఈ ఏడుగురిలో ఇద్దరు ఈ వీక్ హౌస్ ను వీడివెళ్ళబోతున్నారు.
ఇక ఈలోపు బిగ్ బాస్ ఆడియన్స్ కు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడు. అందులో భాగంగా ఇంతకుముందు ప్రేరణ ఈ అవకాశం సాధించగా.. తాజా ఎపిసోడ్ లో నబిల్ టాస్క్ లు గెలిచి ఆ అవకాశం సాధించాడు. అయితే ఈ విషయంలో విష్ణు ప్రియకు రెండు సార్లు అన్యాయం జరిగింది. ఇంతకు ముందు రోజు జరిగిన టాస్క్ లో విఫ్ణు ప్రియ రోహిణి కోసం త్యాగం చేసింది.
ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లో ఉన్నావు కాబట్టి. నీకు ఈ గేమ్ ముఖ్యం అని చెప్పి.. త్యాగం చేసింది. ఇక ఇప్పుడు మాత్రం టాస్క్ లలో నబిల్, విష్ణు ప్రియ ఇద్దరు గెలిచారు. దాంతో బిగ్ బాస్ నిర్ణయం హౌస్ లో ఉన్నవారికి ఇచ్చాడు. అప్పుడు ఎక్కువ మంది నబిల్ కు ఈ అవకాశం ఇవ్వాలి అన్నారు. దాంతో విష్ణు ప్రియ ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఇక నబిల్ తనకు వచ్చిన అవకాశాన్ని యూస్ చేసుకున్నాడు.
ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికి గట్టిగా ప్రయత్నించాడు. తాను పడిన కష్టాన్ని అందరికి గుర్తు చేశాడు. ఇక అంతకు ముందు ఈ అవకాశం కోసం పెట్టిన టాస్క్ లో చాలా గందరగొళం నెకొంది. గేమ్ లో భాగంగా తాడును చుట్టాలి అన్నారు బిగ్ బాస్ నబిల్ కరెక్ట్ గా చుట్టకపోగా.. అందరిమీద గట్టిగా అరుస్తూ.. భయపెడుతూ.. తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని చూశాడు.
కాని బిగ్ బాస్ మాత్రం సరైన సమాధానంతో క్లారిటీ ఇచ్చాడు. ఇక ఓడిపోయింది ఎవరు అన్నవిషయంలో కూడా వాదనలు జరిగాయి. ప్రేరణ విన్ అవ్వడంతో ఓడిపోయింది ఎవరు అనేది ఆమె చెప్పాల్సిన పరిస్థితి. దాంతో అవినాశ్ చివరిగా వచ్చాడు కాబట్టి అతన్ని డిస్ క్వాలిఫై చేసింది. కాని అతను వితండవాదం చేసి ప్రేరణను ఇన్ఫ్యూయన్స్ చేయాలి అని చూశాడు. ఫైనల్ గా అతనే తప్పుకున్నాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో రోజుకో గెస్ట్ రావడం కామన్ గాజరుగుతుందని గతంలోనే చెప్పుకున్నా. ఇంతకు ముందు ఎపిసోడ్ లో శేఖర్ మస్టార్ వస్తే.. తాజా ఎపిసోడ్ లో స్టార్ చెఫ్ సంజయ్ సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని వారాలు గడిచాయి. కాని హౌస్ లో ఉన్నవారు తింటున్నారు కాని ప్రాపర్ గా అందరు వారికి ఇష్టమైన ఫుడ్ మాత్రం తినలేకపోతున్నారు.
ఇక ఈ ఎపిసోడ్ లోబిగ్ బాస్ వారికి అద్భుతమైన ఫుడ్ ను పంపించారు. మటన్ బిర్యానీతో పాటు, అద్భుతమైన స్టార్టర్స్, డిసర్ట్ లను పంపించడంతో హౌస్ లో ఉన్న ఏడుగురు దిల్ ఖుష్ అయ్యారు. ఇక సంజయ్ కూడా తనదైన స్టైల్ లో.. హౌస్ లో ఉన్నవారితో ఆటలాడించి.. ఫన్ ను క్రియేట్ చేశారు. ఈక్రమంలో గౌతమ్, నిఖిల్ మధ్య గొడవ జరిగిన క్రమంలో వారిని కలిపే ప్రయత్నం చేశాడు సంజయ్. ఇద్దరిచేతి ఒకరినొకరికి తిపించుకుని అన్ని నెగెటీవ్స్ ను వదిలేసి.. ఫ్రెండ్స్ గా ఉండాలంటూ సంజయ్ వారిని కోరారు.
దాంతో ఇద్దరు తినిపంచుకుని హగ్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా ఇద్దరు ఒకరికి మరొకరు సారి చెప్పుకున్నారు. దాంతో వారు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక వారం అంతా చాలాప్రశాంతంగా గడిచిపోతోంది. గొడవలు పడినా కూడా కామ్ గా కలిసిపోతున్నారు. ప్రేరణ, నబిల్ మధ్య అంత గొడవ అయినా... వెంటనే వారు కలిసిపోయారు. ఈ విషయంలో రోహిణి.. కాస్త వింతగా ఫీల్అయ్యింది. ఇంత గొడవ పడి.. మళ్లీ కలిసిపోయారేంటి అంటూ కామెంట్ చేసింది.