MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయని పావని ఔట్.. విష్ణు ప్రియను మళ్ళీ కాపాడిన ఫ్యాన్స్.. ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్..

నయని పావని ఔట్.. విష్ణు ప్రియను మళ్ళీ కాపాడిన ఫ్యాన్స్.. ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్..

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూనే ఉన్నారు. ఎలిమినేషన్ విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో.. ఈసారి కూడా అనూహ్యంగా ఒకరు అనుకుంటే మరొకరు బిగ్ బాస్ హౌస్ ను విడిచి వెళ్ళారు. 

Mahesh Jujjuri | Published : Oct 26 2024, 11:23 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 రోజు రోజుకు  రసవత్తరంగా మారుతోంది.ఇప్పటికే 50 రోజులకు పైగా నడుస్తున్న బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తోంది. అంతే కాదు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. గేమ్ అంతా తారుమారు అయ్యింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ ను 8 మంది వీడి బయటకు వెళ్ళిపోయారు. ఇక తాజా ఎలిమినేష్ కు సంబంధించి పెద్ద ట్వీస్ట్ బయటపడింది. 
 

26
Asianet Image

 వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి గా మారింది. ఈ వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేష‌న్స్ లో ఉన్నారు. వీరికి శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరిగింది.

ఎనిమిదో వారం ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ప్రేర‌ణ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక టాప్ కంటెస్టెంట్, కొత్త మెగా చీఫ్ విష్ణు ప్రియ మూడో స్థానంలో కంటిన్యూ అవుతోంది. అలాగే పృథ్వీ నాలుగో ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం.
 

36
Asianet Image

అయితే చివరి రెండు స్టానాల్లో మెహబూబ్ , నయనీపావని ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెహబూబ్ కంటే నయనికి తక్కువ ఓట్లు పడటంతో.. ఆమె బిగ్ బాస హౌస్ ను వీడిబయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అందరూ ఈవీక్ విష్ణు ప్రియ బయటు వెళ్ళిపోతుందేమో అనుకున్నారంతా. పృధ్వీతో ఇంకా అంటకాగాలని చూస్తున్న విష్ణు ప్రియ ఈసారి డేంజర్ జోన్ లో ఉంటుంది అనుకున్నారు. కాని విష్ణు ప్రియ ఓటింగ్ లో మూడో ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడైనా విష్ణు ప్రియ గేమ్ పై దృష్టిపెడుతుందేమో చూడాలి. 
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక నయనీపావని ఎలిమినేషన్ విషయానికి వస్తే..  నయని గత సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి కేవలం ఒక్క వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. ఇక ఈ సీజన్‌లో కూడా నయని పావని తాను నామినేషన్స్‌లోకి వచ్చినా ఫస్ట్ వీక్ లోనే బయటకువెళ్లిపోతుంది.

అయితే ఈ సారి ఒక వారం నామినేషన్స్ షీల్డ్ వల్ల సేవ్ అయితే మరో వారం నయని నామినేషన్స్‌లోకి రాలేదు. కానీ ఈ వారం ఇలా వచ్చిందో లేదో అలా బయటికి వెళ్లిపోతోంది. ఈలెక్కన చూసుకుంటే.. ముందు వారంలోనే ఆమె నామినేషన్ లో ఉండి ఉంటే బయటకు వెళ్లిపోయేదేమో. 
 

56
Asianet Image

ఈసారి చాలా స్ట్రాంగ్ ఆడతానని.. ఎలాగైనా చివరి వరకూ ఉంటానంటూ హౌస్‌లోకి వెళ్లేముందు నయని చెప్పింది. పైగా వచ్చేటప్పుడు సీతను క్రై బేబీ అని లోపలికి వెళ్లాకా నయని అంతకంటే ఎక్కువే ఏడ్చింది. ఇక టాస్కుల్లో కూడా పెద్దగా నయనికి ఆడే స్కోప్ రాలేదు. ఇక ఈ వారం ఒక్క టాస్కులో కూడా నయనికి ఛాన్స్ రాలేదు. దీంతో పెద్దగా ఫుటేజి కూడా లేదు. ఇంకేముంది నామినేషన్స్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కూడా ఉండటంతో నయని పావని ఈ వారం ఎలిమినేషన్ కాక తప్పలేదు.

66
Asianet Image

ఇక సెప్టెంబర్ 1న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం ఎండింగ్ కు వచ్చేసింది. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఏకంగా ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆరోవారంలో మరో ఎనిమది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టారు. మొత్తానికి పాత, కొత్త కంటెస్టెంట్లతో గతంలో కంటే మరింత ఎంటర్ టైనింగ్ గా మారింది బిగ్ బాస్ హౌస్. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బిగ్ బాస్ తెలుగు
 
Recommended Stories
Top Stories