నబీల్, సోనియా మధ్య గిల్లి కజ్జాలు.. ప్లేటు తిప్పేయడం, వాడుకుని వదిలేయడం ఆమెకి సూపర్ గా తెలుసు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాల్గవ వారం మొదలయింది. 23వ ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగే హాట్ హాట్ గా సాగింది. నామినేషన్ జరుగుతున్నప్పుడు మణికంఠ, సోనియా, యాష్మి, ప్రేరణ, ఆఫ్రిది బాగా హైలైట్ అయ్యారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాల్గవ వారం మొదలయింది. 23వ ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగే హాట్ హాట్ గా సాగింది. నామినేషన్ జరుగుతున్నప్పుడు మణికంఠ, సోనియా, యాష్మి, ప్రేరణ, అఫ్రిది బాగా హైలైట్ అయ్యారు. అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది.. ఎవరు నామినేషన్స్ లో నిలిచారో ఇప్ప్పుడు చూద్దాం.
ఆదిత్య ఓం నామినేషన్స్ ప్రక్రియని ప్రారంభించారు. ఒక్కోసభ్యుడు ఇద్దరిని నామినేట్ చేసి.. హౌస్ లో ఉండడానికి ఎందుకు అర్హులు కాదో కారణాలు చెప్పాలి. ఆ తర్వాత వారి ముఖాన ఫోమ్ కొట్టాలి. ఆదిత్య ముందుగా పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ అగ్రెసిన్ నెస్ తో మరీ పిచ్చి వాడిలా ప్రవర్తిస్తున్నాడు అని ఆదిత్య ఆరోపించారు. పిచ్చితనానిని, అగ్రెషన్ కి మధ్య సన్న గీత ఉందని.. దానిని అర్థం చేసుకోలేకున్నావని ఆదిత్య పృథ్వీని విమర్శించాడు. హౌస్ లో ఎఫ్ వర్డ్ లు వాడటంపై కూడా అభ్యంతరం తెలిపాడు. ఆ తర్వాత ఆదిత్య.. సోనియాని నామినేట్ చేస్తూ.. మొదటి వారంలో కనిపించిన జోష్ ఇప్పుడు తనలో లేదనే పాయింట్ ని ఆదిత్య తెలిపారు.
ఆ తర్వాత నైనికా.. మణికంఠ, ఆదిత్య ఇద్దరినీ నామినేట్ చేసింది. మణికంఠ తనని ప్రతి విషయంలో నిరుత్సాహ పరుస్తున్నాడు అని తెలిపింది. అదే విధంగా సెల్ఫిష్ గా కూడా బిహేవ్ చేస్తున్నట్లు ఆరోపించింది. మణికంఠ ఎమిలినేట్ అయితే తనతో పాటు నేను కూడా ఎలిమినేట్ కావాలని అతడు కోరుకున్నట్లు నైనికా ఆరోపించింది. ఆమె మాటలని మణికంఠ ఖండించాడు. ఇక నైనికా..ఆ ఆదిత్యని నామినేట్ చేస్తూ..ఆయన టాస్క్ లు ఆడడానికి భయపడుతున్నారు.. కాబాట్టి ఆయన బిగ్ బాస్ హౌస్ కి ఫిట్ కాదు అని తెలిపింది.
సోనియా, పృథ్వీ ఇద్దరినీ నబీల్ నామినేట్ చేశారు. నబీల్, సోనియా మధ్య గొడవ గిల్లికజ్జాలు అన్నట్లుగా సాగింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు. సోనియా బెలూన్ టాస్క్ లో సంచాలక్ గా ఫెయిల్ అయిందని నబీల్ తెలిపాడు. దీనికి కౌంటర్ గా సోనియా.. నబీల్ కూడా ఎగ్ టాస్క్ లో ఫైయిల్డ్ సంచాలక్ అని అభివర్ణించింది. అసలు నబీల్ కి రూల్స్ బుక్ చదవడం కూడా రాదని పేర్కొంది. దీనితో నబీల్ సోనియాపై సెటైర్లు వేస్తూ వింత సౌండ్స్ చేశాడు. సోనియా కూడా ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ ఫైయిల్డ్ సంచాలక్ అంటూ వెటకారంగా సంభోదించింది. ఆ తర్వాత నబీల్.. పృథ్వీని నామినేట్ చేశారు.
ప్రేరణ.. మణికంఠ, నైనికా లని నామినేట్ చేసింది. మణికంఠ హౌస్ లో ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు అని ప్రేరణ ఆరోపించింది. దీనికి మణికంఠ కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. నైనికాకి మెచ్యూరిటీ లేదు అనే కారణంతో ప్రేరణ ఆమెని నామినేట్ చేసింది. హౌస్ లో సైలెంట్ గా ఉంటావు.. అవసరం అనవసరం అయినా చోట మాట్లాడతావు అని నైనికా గురించి ప్రేరణ చెప్పింది. నేను ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో నాకు ఎవరైనా చెబితే పక్కాగా వాళ్ళని కొడతా అంటూ నైనికా కౌంటర్ ఇచ్చింది.
ఇక సోనియా... నబీల్ పై రివేంజ్ తో అతడిని నామినేట్ చేసింది. ఎగ్ టాస్క్ లో సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడని తెలిపింది. ఆదిత్యని నామినేట్ చేస్తూ మీ గురించి చెప్పడానికి పాయింట్స్ లేవు.. ఎందుకంటే మీరైనా పెర్ఫామ్ చేస్తుంటే కదా అంటూ అతడి పరువు తీసేలా సోనియా కామెంట్స్ చేసింది. అదేవిధంగా విష్ణుప్రియ.. ఆదిత్య, ప్రేరణలని నామినేట్ చేసింది. సీత అయితే ప్రేరణ, మణికంఠ లని నామినేట్ చేసింది.
చివర్లో యాష్మి, సోనియా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. యాష్మి మణికంఠని నామినేట్ చేస్తూ ఫిజికల్లీ వీక్ అని చెప్పింది. నేను ఎవరితో పోల్చుకున్నా వీక్ కాదు అంటూ మణికంఠ ఆమెపై ఫైర్ అయ్యాడు. అదేవిధంగా యాష్మి.. సోనియాని నామినేట్ చేసింది. ప్లేటు ఎలా తిప్పేయాలో, ఎవరిని ఎలా వాడుకుని వదిలేయాలో సోనియాకి సూపర్ గా తెలుసు అంటూ యాష్మి ఆరోపించింది. దీనితో సోనియా కూడా ఆమెతో వాగ్వాదానికి దిగింది.
నామినేషన్ ప్రక్రియ అంతటితో పూర్తయింది. పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనికా, నబీల్, ప్రేరణ నామినేషన్స్ లో నిలిచారు. చివర్లో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చీఫ్ గా ఉన్న నిఖిల్ వీరిలో ఒకర్ని సేవ్ చేయవచ్చు అని తెలిపారు. దీనితో నిఖిల్..నైనికాని సేవ్ చేశారు. దీనితో ఫైనల్ గా నాల్గవ వారం ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయిన సభ్యులు పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.