- Home
- Entertainment
- ఓటింగ్‌లో కన్నడ బ్యూటీ హవా.. డేంజర్ జోన్‌లో ఊహించని కంటెస్టెంట్స్.. ఎలిమినేషన్ షాక్ ఎవరికి ?
ఓటింగ్‌లో కన్నడ బ్యూటీ హవా.. డేంజర్ జోన్‌లో ఊహించని కంటెస్టెంట్స్.. ఎలిమినేషన్ షాక్ ఎవరికి ?
Bigg Boss Telugu 9 Voting: బిగ్ బాస్ తెలుగు 9 తొలి వారం ఓటింగ్ హీట్ పిక్‌కి చేరింది . కన్నడ బ్యూటీ తనూజ టాప్‌లో దూసుకెళ్తుండగా, ఫ్లోరా, సంజనా, శ్రేష్టి వర్మ లు డేంజర్ జోన్‌లో చిక్కుకోవడంతో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరిగింది!

బిగ్ బాస్ ఓటింగ్..
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైన నాలుగు రోజుల్లోనే హౌస్ వాతావరణం వేడెక్కిపోయింది. తొలివారం నామినేషన్లు పూర్తి కావడంతో, అభిమానుల ఓటింగ్ రేస్ కూడా స్టార్ట్ అయింది. అందరి దృష్టి ఇప్పుడు ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? అనే దానిపైనే ఉంది.
కంటెస్టెంట్స్‌తో పుల్ జోష్
బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్ అయింది. ఈ సీజన్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు తనూజా పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, శ్రేష్టి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నారు. అలాగే.. కామనర్స్‌గా హరిత హరీష్, దమ్ము శ్రీజ, పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
హోరాహోరీ నామినేషన్స్
బిగ్ బాస్ షోలో హైప్ ఇచ్చే అంశమే నామినేషన్స్. ఈ సీజన్ లో తొలివారం నామినేషన్స్ చాలా హోరాహోరీగా జరిగాయి. అప్పటివరకు ఫ్రెండ్లీగా ఉన్న కంటెస్టెంట్లు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. వాదనలు, ప్రతివాదనలతో బిగ్ బాస్ హౌస్ ని ఒక్కసారిగా హీటెక్కించారు. అలా మంగళవారం ప్రారంభమైన నామినేషన్స్ తో హౌస్‌లో రూల్స్ మొత్తం మారిపోయాయి. ఈసారి బిగ్‌బాస్ కామనర్స్‌కి పవర్ ఇచ్చి, నేరుగా సెలబ్రిటీలను నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్స్‌లో ఎక్కువ మంది సంజనా గల్రానీని టార్గెట్ చేశారు. మొత్తంగా ఈ వారం సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్ నామినేషన్స్ జాబితాలో నిలిచారు. మొత్తం 9 మంది నామినేట్ కాగా, అందులో పవన్ మాత్రమే కామనర్, మిగితా వారందరూ సెలబ్రెటీలే.
ఓటింగ్‌లో టాప్‌లో ఎవరు?
ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం, కన్నడ బ్యూటీ తనూజా పుట్టస్వామి హౌస్‌లో టాప్ ప్లేస్ దూసుకపోతుంది. ఇప్పటి వరకూ ఆమెకు 23% పైగా ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఎవరూ ఊహించని విధంగా సుమన్ శెట్టి ఉన్నారు ఆయన 21 % ఓట్లతో కొనసాగుతున్నారు. ఆ తరువాత స్థానంలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ 20% ఓట్లతో పరుగులు దీస్తున్నారు. ఇక నాలుగో స్థానంలో డిమోన్ పవన్ 11 % ఓట్లతో నిలిచాడు. ఇక రీతూ చౌదరి 08%, రాము రాథోడ్ 7%, సంజనా గల్రానీకి 7% ఓట్లతో మధ్యస్థానాల్లో ఉన్నారు. ఇక ఫ్లోరా షైనీకి 4%, శ్రేష్టి వర్మ కి 3% ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.
డేంజర్ జోన్‌లో ఎవరు?
ప్రస్తుతం ఓటింగ్ లెక్కల ప్రకారం ఫ్లోరా షైనీ, సంజనా గల్రానీ, శ్రేష్టి వర్మలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ లైన్స్ ముగిసే వరకు ఇంకా మూడు రోజులు ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉన్నప్పటికీ, మొదటి వారం ఎలిమినేషన్స్‌లో ఎక్కువగా వయసు పైబడినవారే బయటకు వెళ్లడం సెంటిమెంట్‌గా మారింది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా? లేక హౌస్‌లోని డ్రామా ఫలితాన్ని మార్చేస్తుందా? అన్నది రాబోయే ఎపిసోడ్‌లలో తేలనుంది.
నోట్: ఈ ఆర్టికల్ ను అన్లైన్ ఓటింగ్ సర్వేల ఆధారం చేసుకుని రాయడం జరిగింది.