- Home
- Entertainment
- బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేషన్, రాము రాథోడ్ కోసం డోర్స్ ఓపెన్
బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేషన్, రాము రాథోడ్ కోసం డోర్స్ ఓపెన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొత్త ట్విస్ట్ లతో రసవత్తరంగా మారింది. ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఈసారి కూడా ఎవరూ ఊహించని కంటెస్టెంట్ బయటకు పంపించి పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఉత్కంఠభరితంగా బిగ్ బాస్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముందు కాస్త చప్పగా అనిపించినా.. ఆతరువాత మసాలా డోస్ పెంచేస్తున్నారు.. రోజు రోజుకి ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది ఈసీజన్. ప్రతీ వీక్ ఎండ్ కు ఎలాంటి ట్విస్ట్ లు చూడాల్సి వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఏడవ వారం పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టబోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్9. ప్రతి వీకెండ్ ఎలిమినేషన్ కామన్.. కానీ ఈమధ్య అందులో కూడా ఎన్నో ట్విస్ట్ లు చూపిస్తున్నారు టీమ్. ఇక ఈవారం ఎలిమినేషన్ ఎవరు..? అందరు అనుకుని ఊహించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారా..? వీకెండ్ బిగ్ బాస్ ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటీ?
ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఈ వారం ఎలిమినేషన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వీక్ ఎవరు బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్లబోతున్నారు అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తగ్గట్టు వారు పేర్లు వెల్లడిస్తున్నారు. ఈ లిస్ట్ లో అనేక మంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే అందరి చూపు ఫోక్ సింగర్ రాము రాథోడ్ మీద ఉంది. ఈ వార రాము ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అని అంతా ఊహించారు. అందుకు తగ్గట్టుగానే హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ అమర్ దీప్ పోలీస్ గెటప్స్ లో వచ్చి రామును ఎలిమినేట్ చేసి తీసుకెళ్లారు. దాంతో హౌస్ లో గంభీరమైన వాతావరణం ఏర్పడింది. ఇంతలో ట్విస్ట్ ఇస్తూ.. ఇది ప్రాంక్ అని ప్రకటించారు. మరి నిజంగా ఇది ప్రాంకా.. లేక రాము రాథోడ్ ను నిజంగానే వీకెండ్ లో పంపించబోతున్నారా? అని పెద్ద చర్చ జరుగుతోంది.
ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్..
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రమ్య మోక్ష , రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖిత, తనూజ , రాము రాథోడ్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. కెప్టెన్లుగా ఉన్న సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలు మాత్రం నామినేషన్‌లకు మినహాయింపు పొందారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం తనూజ అత్యధిక ఓట్లతో ముందంజలో ఉంది. ఆమె 37.46 శాతం ఓటింగ్ సాధించింది. ఆ తరువాతి స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల 20.42 శాతం, దివ్య నిఖిత 9.81 శాతం, రాము రాథోడ్ 8.86 శాతం, సంజన గల్రానీ 8.81 శాతం, రీతూ చౌదరి 6.49 శాతం, సాయి శ్రీనివాస్ 4.83 శాతం, రమ్య మోక్ష 3.31 శాతం ఓటింగ్ సాధించారు. ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రమ్య మోక్ష ఈవారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గాసిప్ కింగ్ రమ్య మోక్ష
రమ్య మోక్ష హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది. అందరి విషయంలో తలదూర్చడం.. పర్సనల్ విషయాలు కదిలించడంతో పాటు.. పవన్ కళ్యాన్ ను పర్సనల్ కామెంట్స్ చేయడం ఆమెకు బాగా నెగెటీవ్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. మరీముఖ్యంగా మాధురీతో కలిసి ఆమె చేస్తున్న కామెంట్స్ ఆడియన్స్ కు నచ్చడంలేదు. హౌస్ మెంట్స్ పై సర్సనల్ గా మాట్లాడటం కూడా ఆమె ఇమేజ్ ను దెబ్బతీసింది. లాస్ట్ వీకెండ్ లో నాగార్జున హెచ్చరించిన తరువాత కూడా ఆమె.. ఇలాంటివి మానుకోలేదు. అంతే కాదు ఇంట్లో పెద్దగా యాక్టీవ్ గా కూడా ఉండటంలేదు. ఇలాంటి విషయాలు చాలా ఆమెకు నెగెటీవ్ గా మారాయి. దాంతో ఆమె ఓటింగ్ లో వెనకబడటంతో.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని మరో వాదన కూడా వినిపిస్తోంది.