- Home
- Entertainment
- బాలకృష్ణ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన కమల్ హాసన్..లేకుంటే ఒక చరిత్ర తుడిచిపెట్టుకుపోయేది ?
బాలకృష్ణ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన కమల్ హాసన్..లేకుంటే ఒక చరిత్ర తుడిచిపెట్టుకుపోయేది ?
నందమూరి బాలకృష్ణ, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక చిత్రం మిస్ అయింది. బాలయ్య నటించిన ఆ మూవీని కమల్ హాసన్ రిజెక్ట్ చేసి మంచి పని చేశారు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

బాలకృష్ణ, కమల్ హాసన్ కాంబినేషన్
నందమూరి బాలకృష్ణ, విలక్షణ నటనతో నటనతో దశాబ్దాలుగా అలరిస్తున్న కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక చిత్రం మిస్ అయింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అది వాస్తవం. పొరపాటున ఆ చిత్రంలో కమల్ హాసన్ నటించి ఉంటే ఒక చరిత్ర తుడిపెట్టుకుపోయేది అని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఒక గొప్ప చిత్రం దారుణంగా నిరాశపరిచేది అని భావిస్తున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటనుకుంటున్నారా.. వివరాల్లో తెలుసుకుందాం.
ఆదిత్య 369 మూవీ
నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన అద్భుత దృశ్య కావ్యం ఆదిత్య 369. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా మోహిని నటించారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించారు. ఒక పాత్రలో శ్రీకృష్ణ దేవరాయులుగా మరో పాత్రలో కృష్ణ కుమార్ గా నటించారు. ఆదిత్య 369 చిత్రం చరిత్ర సృష్టించింది. రెండు పాత్రల్లో బాలయ్య తిరుగులేని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో అయితే బాలయ్య తప్ప ఇంకొకరికి అసాధ్యం అన్నట్లుగా బాలయ్య నటన, గెటప్ ఉంటుంది.
రిజెక్ట్ చేసిన కమల్
సింగీతం శ్రీనివాస రావు ముందుగా కృష్ణ కుమార్ పాత్ర కోసం కమల్ హాసన్ ని అనుకున్నారట. కానీ ఆ సమయంలో కమల్ హాసన్ వరుస చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆదిత్య 369 చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దీనితో కృష్ణ కుమార్ పాత్రని కూడా బాలయ్యే పోషించి అదరగొట్టారు. కమల్ హాసన్ నటించి ఉంటే ఆ పాత్ర అంతగా పండి ఉండేది కాదని అభిమానుల అభిప్రాయం. పిల్లలు చేసిన అల్లరి పని వల్ల బాలకృష్ణ, హీరోయిన్ ఇద్దరూ టైం మెషీన్ లో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళతారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో సాగే కథ అత్యంత అద్భుతంగా ఉంటుంది.
మోక్షజ్ఞ ఎంట్రీపై అంచనాలు
శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి తిరిగి ప్రస్తుత కాలం కంటే 500 ఏళ్ళు ముందుకి వెళతారు. ఆ విధంగా ఆసక్తికర మలుపులతో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బాలయ్య, కమల్ హాసన్ కాంబినేషన్ మిస్ అయినప్పటికీ.. అదే మంచిది అయింది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో సిల్క్ స్మిత కూడా కీలక పాత్రలో నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. ఇప్పుడు ఇదే చిత్రం సీక్వెల్ తో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ సినిమాలో తొలి టైం ట్రావెల్ మూవీ
ఇండియన్ సినిమాలోనే తొలి టైం ట్రావెల్ మూవీగా ఆదిత్య 369 ఘనత సాధించింది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అని ఊరిస్తున్నారే తప్ప ఏళ్ళు మాత్రం గడిచిపోతున్నాయి. మోక్షజ్ఞ కొత్త లుక్ లో కనిపించిన ప్రతి సారీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోతున్నారు. కానీ మోక్షజ్ఞ మూవీ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఉండడం లేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు మోక్షజ్ఞ ని లాంచ్ చేసే దర్శకుల జాబితాలో క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వినిపిస్తోంది.