- Home
- Entertainment
- ఆ దరిద్రం ఎందుకులే అని చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్.. మంచి పని చేసింది
ఆ దరిద్రం ఎందుకులే అని చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్.. మంచి పని చేసింది
చిరంజీవి సినిమాని ఓ సీనియర్ హీరోయిన్ రిజెక్ట్ చేశారు. ఆమె ఎవరు ? ఆ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఘరానా మొగుడు చిత్రం వరకు తిరుగులేదు అన్నట్లుగా సాగింది. ఆ తర్వాత చిరంజీవికి కొన్నేళ్లు కష్టాలు ఎదురయ్యాయి. చిరంజీవి ఎలాంటి చిత్రంలో నటించినా అది ఫ్లాప్ అవుతూ ఉండేవి. ఒకటి రెండు చిత్రాలు హిట్ అయినప్పటికీ చిరంజీవికి విమర్శలు తప్పలేదు. ఆ టైంలో ఏం జరిగింది. చిరంజీవిపై విమర్శలకు కారణం ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఘరానా మొగుడు చిత్రాన్ని నిర్మించిన దేవి వరప్రసాద్ రెండేళ్లు ఎదురు చూసి మళ్ళీ చిరంజీవితోనే సినిమా ప్రారంభించారు.
ఘరానా మొగుడు తర్వాత ముఠామేస్త్రి, ఎస్పీ పరుశురాం లాంటి ఫ్లాపులు చిరంజీవికి ఎదురైనప్పటికీ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రతి చిత్రానికి అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చేవి. ఆ ధైర్యంతోనే నిర్మాత దేవి వరప్రసాద్.. డైరెక్టర్ ఇవివి సత్యనారాయణతో బడ్జెట్ గురించి ఆలోచించకుండా సినిమా తీయమని స్వేచ్ఛ ఇచ్చారట. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ చిత్రమే అల్లుడా మజాకా.
తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా హీరో తన అత్తగారికి బుద్ది చెప్పే కథే ఈ చిత్రం. ఈవీవీ సత్యనారాయణ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే పెట్టారు. కానీ డబుల్ మీనింగ్ డైలాగుల డోసు, అసభ్యకర సన్నివేశాలు ఎక్కువ కావడంతో అల్లుడా మజాకా ఒక బూతు సినిమా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కమర్షియల్ గా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ మహిళా సంఘాలు చిరంజీవిపై చిత్ర యూనిట్ పై దుమ్మెత్తి పోశాయి.
ముఖ్యంగా ఈ చిత్రంలో అత్తగా నటించిన లక్ష్మీ, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు, డ్యాన్సులు చాలా వల్గర్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోయారు. అత్త పాత్రలో ముందుగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీని అనుకున్నారు. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ముందుగా వాణిశ్రీని సంప్రదించారు. అప్పటికే వాణిశ్రీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో చిరంజీవికి అత్తగా నటించింది. పైగా అల్లుడా మజాకా మూవీలో ఉండే సన్నివేశాలు శృతి మించేలా ఉన్నాయని వాణిశ్రీ కథ విన్నప్పుడే పసిగట్టారు. ఆ దరిద్రం ఎందుకులే అని ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసేశారు.
ఆ విధంగా వాణిశ్రీ ఒక బూతు సినిమా నుంచి తప్పించుకుని మంచి పని చేశారు. ఈ మూవీతో వచ్చిన విమర్శల వల్ల చిరంజీవి కూడా బాగా హర్ట్ అయ్యారట. చిరంజీవి ఆ తర్వాత నటించిన బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు కూడా నిరాశ పరిచాయి. చివరికి 1997లో చిరంజీవి హిట్లర్ చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.