- Home
- Entertainment
- బిగ్ బాస్ హౌస్ లో కొత్త లవ్ స్టోరీ, ఇమ్మాన్యుయేల్ తో తనూజ రొమాన్స్.. పాపిష్టోడా అంటూ కామెంట్
బిగ్ బాస్ హౌస్ లో కొత్త లవ్ స్టోరీ, ఇమ్మాన్యుయేల్ తో తనూజ రొమాన్స్.. పాపిష్టోడా అంటూ కామెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కొత్త లవ్ స్టోరీ మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇమ్మాన్యుయేల్, తనూజ ఇద్దరూ చిలిపిగా, రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.

Bigg Boss Telugu 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ లో మాస్క్ మాన్ హరీష్, సంజన, ఫ్లోరా షైనీ, ఇమ్మాన్యుయేల్, మర్యాద మనీష్ వివాదాలతో హైలైట్ అయ్యారు. సెకండ్ వీక్ లో కూడా వివాదాల హీట్ ఇంకా పెరుగుతుందేమో చూడాలి. అయితే సెకండ్ వీక్ సరదాగా, ఇంటి సభ్యుల చిలిపి అల్లరితో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 డే 8 ప్రోమో విడుదలయింది.
జంటగా రీతూ, డిమాన్ పవన్
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని అంతా భవించారు. అంచనాలకు తగ్గట్లుగానే ఇమ్మాన్యుయేల్ కావలసిన వినోదం అందిస్తున్నాడు. అవసరం అయినప్పుడు తనలోని కోపాన్ని బయట పెడుతూనే.. మిగిలిన టైం లో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం హౌస్ లో రీతూ చౌదరి, డిమాన్ పవన్ మధ్య లవ్ స్టోరీ సాగుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వీరిద్దరూ తరచుగా జంటగా కనిపిస్తున్నారు.
రీతూ, పవన్ జంటపై ఇమ్మాన్యుయేల్ ఫన్నీ సెటైర్లు
లేటెస్ట్ ప్రోమోలో వీరిద్దరూ జంటగా కూర్చుని టిఫిన్ తింటున్నారు. వెళ్లద్దరినీ చూసి ఇమ్మాన్యుయేల్ ఆటపట్టించారు. పవన్, రీతూ జంటగా కూర్చుని ఉంటే.. వాళ్ళ వెనక వెళ్లిన ఇమ్మాన్యుయేల్.. రీతూని మిస్సవుతున్నాను, నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు. నా పక్కన ఉన్న దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకురా పవన్ మా లైఫ్ తో ఆడుకుంటున్నావ్.. చెప్పారా పాపిష్టోడా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు.
తనూజతో చిలిపిగా ఇమ్మాన్యుయేల్
ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, తనూజ మధ్య ఫన్నీ రొమాన్స్ మొదలైంది. తనూజ సైలెంట్ గా ఇమ్మాన్యుయేల్ పక్కన వెళుతోంది. ఆమె ఏమీ చేయకపోయినప్పటికీ తన నడుము గిల్లినట్లు ఇమ్మాన్యుయేల్ హంగామా చేశాడు. తనూజ ప్లీజ్ నడుము గిల్లకు.. ఏంటీ చిన్న పిల్లల ఆటలు అని ప్రశ్నించాడు. తాను ఏమి చేయకపోయినప్పటికీ ఇమ్మాన్యుయేల్ అలా అనడంతో ఆమె ఆశ్చర్యపోయింది.
నడుము గిల్లుతోంది అంటూ రచ్చ
చూడు బిగ్ బాస్ తనూజ నా నడుము గిల్లుతోంది అని చెప్పాడు. దీనితో తనూజ అసలు నేను ముట్టుకోలేదు అని తెలిపింది. ఎందుకు నడుము గిల్లుతావ్.. ఇది టీవీల్లో వస్తుంది. చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని ఇమ్మాన్యుయేల్ హంగామా చేశాడు. అసలు అక్కడ నడుము ఎక్కడ ఉంది అని రీతూ, తనూజ ప్రశ్నించగా అతడు ఇచ్చిన రియాక్షన్ నవ్వులు పూయిస్తోంది. దీనితో నెటిజన్లు హౌస్ లో కొత్త లవ్ స్టోరీ మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు. ఇమ్మాన్యుయేల్, తనూజ తప్పకుండా టాప్ 5 లో ఉంటారని జ్యోస్యం చెబుతున్నారు.