- Home
- Entertainment
- హౌస్ లో మహానటి దివ్య, భలే బురిడీ కొట్టించింది.. నేనేం నీ సర్వెంట్ ని కాదు అంటూ రీతూకి ఇచ్చిపడేసిన గౌరవ్
హౌస్ లో మహానటి దివ్య, భలే బురిడీ కొట్టించింది.. నేనేం నీ సర్వెంట్ ని కాదు అంటూ రీతూకి ఇచ్చిపడేసిన గౌరవ్
కిచెన్ వ్యవహారాల్లో రీతూ చౌదరి, గౌరవ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. కిచెన్ డిపార్ట్మెంట్ లో గౌరవ్ ఉండడానికి వీల్లేదు అని రీతూ తెలిపింది. రెబల్ గా ఉంటూనే ఎవ్వరికీ అనుమానం రాకుండా దివ్య ఇంటి సభ్యులని భలే బురిడీ కొట్టించింది.

హౌస్ లో పాలు దొంగతనం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం సీక్రెట్ టాస్కులు ఎక్కువయ్యాయి. హౌస్ ఉన్న రెబల్స్ ని గుర్తించలేక మిగిలిన కంటెస్టెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సుమన్ శెట్టి, దివ్య హౌస్ లో రెబల్స్ గా ఉన్నారు. నిన్న మంగళవారం ఎపిసోడ్ లో దివ్య, సుమన్ ఇద్దరూ కిచెన్ లో ఉన్న పాల ప్యాకెట్స్ ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం ఎపిసోడ్ లో ఉదయం రేషన్ మ్యానేజర్ అయిన రీతూ.. ఎవరో పాల ప్యాకెట్స్ దొంగిలించినట్లు గుర్తించింది.
కిచెన్ డిపార్ట్మెంట్ లో గౌరవ్ వద్దు
పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో ఇంట్లో కాసేపు హడావిడి కనిపించింది. కుకింగ్ డిపార్ట్ మెంట్ లో ఉన్న గౌరవ్ సమయానికి ఇంటి సభ్యులకు ఆమ్లేట్ వేసి ఇవ్వలేదని కెప్టెన్ దివ్య, రేషన్ మేనేజర్ రీతూ ఫైర్ అయ్యారు. స్నానం చేసి రావడం వల్ల 5 నిమిషాలు లేట్ అయింది అని వివరణ ఇచ్చారు. కుకింగ్ విషయంలో నీపై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అని దివ్య పేర్కొంది. గౌరవ్ ఇక నుంచి కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉండడానికి వీల్లేదని రీతూ పేర్కొంది.
నీ సర్వెంట్ ని కాదు
హౌస్ లో పాలు పోయాయి. నా పాలు నాకు కావాలి. దానికి రేషన్ మ్యానేజర్ రీతూ భాద్యత తీసుకోవాలి అని గౌరవ్ కౌంటర్ ఇచ్చారు. రీతూని దివ్య సపోర్ట్ చేసింది. అది ఆమె ప్రమేయం లేకుండా జరిగింది. 24 గంటలో రీతూ ఫ్రిజ్ దగ్గర కాపలా కాయలేదు కదా అని దివ్య తెలిపింది. దీనికి గౌరవ్ కౌంటర్ ఇస్తూ నేను కూడా 24 గంటలు కిచెన్ లో ఉండలేను. 5 నిమిషాలు ఆమ్లెట్ లేట్ అయినందుకే ఇంత రచ్చ చేస్తోంది.. పాలు పోయినందుకు కూడా ఆమెని బాధ్యత తీసుకోమనండి అంటూ గౌరవ్ రీతూ కి కౌంటర్ ఇచ్చారు. 24 గంటలు కిచెన్ లో ఉండడానికి తాను నీ సర్వెంట్ ని కాదు అని గౌరవ్ ఫైర్ అయ్యాడు.
మహానటిలా నటించిన దివ్య
దివ్య రెబల్ గా పాలు దాచిపెట్టి ఏమీ తెలియనట్లు నటించింది. బిగ్ బాస్ ఆమెకి ఫోన్ చేసి తన టాస్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు సీక్రెట్ గా అభినందలు తెలిపారు. ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు డిమాన్ పవన్ అని అనుకుని పొరపాటు పడ్డారు. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ తో సీక్రెట్ గా ఫోన్ లో మాట్లాడుతూ.. సంజన రెబల్ అయి ఉండొచ్చు అని గెస్ చేశాడు. దీనితో బిగ్ బాస్ నీ తెలివి నీ జుట్టుని చూస్తుంటే అర్థం అవుతోంది అంటూ ఇమ్మాన్యుయేల్ పరువు తీశాడు.
ఆరెంజ్ టీం విజేతలు
ఆ తర్వాత బిగ్ బాస్ పింక్, ఆరెంజ్, బ్లూ టీమ్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు టచ్ ఇట్, స్మెల్ ఇట్ గెస్ ఇట్. చీకటిగా ఉన్న యాక్టివిటీ ఏరియా లోకి ఒక్కో టీం సభ్యులు వెళ్లి అక్కడ ఉన్న వస్తువులని టచ్ చేసి, స్మెల్ చేసి వాటి పేర్లు చెప్పాలి. అక్కడ భయపెట్టడానికి గోస్ట్ లు కూడా ఉంటాయి. ఈ టాస్క్ లో ఆరెంజ్ టీం విజేత గా నిలిచింది.